
ఉలన్ ఉడే (రష్యా): ఆడుతున్న తొలి ప్రపంచ ఛాంపియన్ షిప్ లోనే భారత యువ మహిళా బాక్సర్ మంజు రాణి అదరగొట్టింది. 2001లో మేరీకోమ్ తర్వాత బరిలోకి దిగిన తొలి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే ఫైనల్‌కు చేరిన తొలి భారత బాక్సర్‌గా గుర్తింపు పొందింది. శనివారం జరిగిన 48 కేజీల సెమీఫైనల్లో మంజు 4–1తో చుఠామట్ రక్సత్ (థాయ్‌లాండ్)పై ఘన విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో్ల ఎకతెరీనా పల్త్‌సెవా (రష్యా)తో మంజు రాణి తలపడుతుంది.
మేరీకోమ్‌కు షాక్...
రికార్డు స్థాయిలో ఏడో పసిడి పతకంపై గురిపెట్టిన భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తన పోరాటాన్ని సెమీస్‌తో ముగించింది. దీంతో ఆమె ఈసారి కాంస్యంతో సరిపెట్టుకుంది. 51 కేజీల విభాగంలో జరిగిన సెమీస్ బౌట్‌లో ఆమె 1–4తో రెండో సీడ్ బుసెంజ కకిరోగ్లు (టర్కీ) చేతిలో ఓడింది. 54 కేజీల విభాగంలో జమునా బోరో 0–5తో టాప్‌సీడ్ హుయాంగ్ హ్సియావో వెన్ (చైనీస్ తైపీ) చేతిలో, లవ్లీనా 2–3తో యాంగ్ లియు (చైనా) చేతిలో ఓడి కాంస్యాలతో సంతృప్తి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment