ఏసీకి అవిశ్వాస ప్రకటన అందిస్తున్న అధికార, ప్రతిపక్ష సభ్యులు
జనగామ: జనగామ మున్సిపల్ చైర్‌పర్స పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్‌పై అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌కి అవిశ్వాస నోటీసులు అందజేశారు. తొమ్మిది రోజులపాటు క్యాంపు రాజకీయం నడిపించిన అధికార పక్షం ఆ ఇద్దరిని తొలగించాలని కోరుతూ 11 మంది బీఆర్‌ఎస్, 8 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు వేర్వేరుగా అవిశ్వాస నోటీసులు ఇచ్చారు.
ఫ్లోర్‌లీడర్ మారబోయిన పాండును తొలగించాలని అధిష్టానాన్ని కోరినట్లు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. కాంట్రాక్టర్లు, ఇళ్లనిర్మాణ అనుమతులకు కమీషన్లు వసూలు చేస్తూ పార్టీని అప్రతిష్టపాలు చేస్తుండటంతో అవిశ్వాసం నోటీసులు ఇచ్చినట్లు చైర్‌పర్సన్ రేసులో ఉన్న 19వ వార్డు సభ్యురాలు బండ పద్మ తెలిపారు. కాగా, నలుగురు బీజేపీ సభ్యులు కూడా తమతో టచ్‌లో ఉన్నారని ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment