ramprasad
-
ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది: జబర్దస్త్ రాంప్రసాద్
-
ఉప్పాల రాంప్రసాద్ పార్థీవదేహానికి సీఎం జగన్ నివాళులు
సాక్షి, కృష్ణా జిల్లా: పెడన మండలం కూడూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం పర్యటించారు. అనారోగ్యంతో కన్నుమూసిన వైఎస్సార్సీపీ నేత ఉప్పాల రాంప్రసాద్ పార్థీవ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.. అనంతరం కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. కృష్ణాజిల్లాకు చెందిన ఉప్పాల రాంప్రసాద్ (68) అనారోగ్యంతో కన్నుమూశారు. పెడన మండలం కూడూరుకు చెందిన రాంప్రసాద్ డీసీఎంఎస్ చైర్మన్‌గా పనిచేశారు. అనారోగ్యంతో గత కొద్ది రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. పెడన నియోజకవర్గంలో సీనియర్ రాజకీయ నాయకుడిగా టీడీపీ, వైఎస్సార్ సీపీల్లో పదవులు నిర్వహించి ఆయన పెడన మండలంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. గతంలో టీడీపీ లీడర్‌గా ఉన్న ఆయన వైఎస్సార్ సీపీ ఆవిర్భావం సందర్భంగా ఆ పార్టీ చేరి పెడన నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన అంకిత భావానికి, సేవలకు మెచ్చిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 2014లో కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఒటమి పాలయ్యారు. అనంతరం పార్టీకి చేస్తున్న సేవలకు గుర్తింపుగా సీఎం జగన్ రాంప్రసాద్ కోడలు ఉప్పాల హారికను కృష్ణాజిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నియమించారు. రాంప్రసాద్ అకాల మరణం పెడన నియోజకవర్గానికి తీరని లోటని పలువురు పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. చదవండి: నాడు భయం భయం.. నేడు భద్రతకు భరోసా -
జనగామ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాస నోటీసులు
జనగామ: జనగామ మున్సిపల్ చైర్పర్స పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్పై అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌కి అవిశ్వాస నోటీసులు అందజేశారు. తొమ్మిది రోజులపాటు క్యాంపు రాజకీయం నడిపించిన అధికార పక్షం ఆ ఇద్దరిని తొలగించాలని కోరుతూ 11 మంది బీఆర్ఎస్, 8 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు వేర్వేరుగా అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఫ్లోర్‌లీడర్ మారబోయిన పాండును తొలగించాలని అధిష్టానాన్ని కోరినట్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. కాంట్రాక్టర్లు, ఇళ్లనిర్మాణ అనుమతులకు కమీషన్లు వసూలు చేస్తూ పార్టీని అప్రతిష్టపాలు చేస్తుండటంతో అవిశ్వాసం నోటీసులు ఇచ్చినట్లు చైర్పర్సన్ రేసులో ఉన్న 19వ వార్డు సభ్యురాలు బండ పద్మ తెలిపారు. కాగా, నలుగురు బీజేపీ సభ్యులు కూడా తమతో టచ్‌లో ఉన్నారని ఆమె చెప్పారు. -
3 మంకీస్ టీమ్‌తో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ
-
త్రీ మంకీస్ సినిమా రివ్యూ
సినిమా : త్రీ మంకీస్ నటీనటులు: సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, కారుణ్య చౌదరి దర్శకత్వం: జి.అనిల్ కుమార్ నిర్మాత: నగేష్. జి సంగీతం: జి. అనిల్ కుమార్ బ్యానర్: ఓరుగల్లు సినీ క్రియేషన్స్ జానర్: హారర్ కామెడీ ‘సాఫ్ట్వేర్ సుధీర్’ చిత్రం అంతగా ఆడకపోయినా బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ మరోసారి హీరోగా ముందుకొచ్చాడు. పైగా ఈసారి తన జబర్దస్త్ టీం శ్రీను, రాంప్రసాద్‌తో కలిసి సినిమా చేయడం విశేషం. ఇక ట్రైలర్ బాగుందంటూ మెగాస్టార్ చిరంజీవి ‘త్రీ మంకీస్’ను అభినందించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. జబర్దస్త్ షో పాపులారిటీ సినిమాకు ఏమేరకు ప్లస్ అయ్యింది? బుల్లితెరపై కడుపు చెక్కలయ్యేలా నవ్వించే ఈ టీమ్ వెండితెరపై ఏమేరకు నవ్వులు పండించగలిగింది..? సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ హీరోలుగా ప్రేక్షకులను మెప్పించారా లేదా అనేది చూద్దాం.! కథ: సంతోష్ (సుధీర్) మార్కెటింగ్ శాఖలో పనిచేస్తుంటాడు. అతనికి ఫణి (గెటప్ శ్రీను), ఆనంద్ (ఆటో రాంప్రసాద్) ప్రాణ స్నేహితులు. ఈ ముగ్గురు కలిసి చేసే కోతిచేష్టలకు అంతే లేదు. సరదాగా సాగిపోతున్న వీరి జీవితంలోకి సన్నీలియోన్ ఎందుకు వచ్చింది? అసలు ఆమె ఎవరు.. ఎలా చనిపోయింది? ఆమె చావుకు ఈ ముగ్గురికి సంబంధమేంటి? ఇంతలో సుధీర్ ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంటాడు. అతన్ని కాపాడేందుకు ఫణి, ఆనంద్ ఏం చేశారు? అసలే చిక్కుల్లో ఉన్న వీరిపై ఓ పాపను కాపాడాల్సిన బాధ్యత ఎలా పడింది. ఆమెను వీరు ఎలా కాపాడారు..? అని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..! (వీళ్లకి టీవీయే కరెక్ట్ అని మాత్రం అనుకోరు) విశ్లేషణ: సాయం అనే మందు లేక చాలామంది చనిపోతున్నారనే అంశాన్ని దర్శకుడు కథలో అంతర్లీనంగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా తొలి అర్ధభాగం త్రీ మంకీస్ పంచ్‌లు, సరదా సన్నివేశాలతో పరవాలేదనిస్తుంది. వాళ్ల పంచ్‌లు పేలడంతో పెద్దగా బోర్ కొట్టదు. అయితే, సెకండాఫ్‌కు వచ్చేసరికి కథ అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. ముగ్గురు స్నేహితులను ఓ హత్య కేసులో ఇరికించి, ప్రేక్షకుడిని థ్రిల్ చేద్దామనుకున్న దర్శకుడు అందులో పూర్తిగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. కథ క్రైమ్ జానర్లోకి వెళ్లిన తర్వాత దర్శకుడు తేలిపోయాడు. అమ్మాయి హత్య కేసులో ముగ్గురు ఇరుక్కు పోయినప్పుడు.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు అంతగా పండలేదు. ఏది ఆశించి.. కథ రాసుకున్నాడో అది నిజం చేసేందుకు దర్శకుడి పనితనం సరిపోలేదు. తొలి అర్థభాగం జబర్దస్త్ పంచ్‌లతో ఫరావాలేదనిపంచిన దర్శకుడు.. రెండో అర్థభాగం థ్రిల్లర్ నేపథ్యంలో కథ నడపలేకపోయాడు. ఇక పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం లేవు. రెండు పాటలు ఫరవాలేదనిపించాయి. బుల్లితెరపై అల్లరి చేసే త్రీ మంకీస్‌లో.. ఎమోషన్స్ అనే కొత్త కోణం చూపించారు. షకలక శంకర్, కారుణ్య చౌదరి ఓకే అనిపిస్తారు. చిన్న సినిమా అయినా.. సాంకేతికంగా జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇక ముగ్గురు హాస్యనటుల్ని ఒకేసారి వెండితెరపై చూపడం.. సగటు అభిమానికి నచ్చుతుంది. అయితే, వాళ్లలోని ప్రతిభను పూర్తిస్థాయిలో ఆవిష్కరించే కథ మాత్రం కాదని చెప్పాలి. దర్శకుడు కేవలం కామెడీనే నమ్ముకుంటే బాగుండేంది. ప్లస్ పాయింట్స్: సుధీర్, శ్రీను, రాంప్రసాద్ నటన కామెడీ టైమింగ్ మైనస్ పాయింట్స్: కొత్తదనం లేకపోవడం భయపడేంత హారర్ సీన్లు లేకపోవడం -
ఇప్పుడే హీరో ట్యాగ్ వద్దు
‘‘ప్రేక్షకులకు వినోదం పంచాలని ఇండస్ట్రీకి వచ్చాను. టీవీ, సిల్వర్ స్క్రీన్, యూట్యాబ్ చానెల్ ఇలా ప్లాట్‌ఫామ్ ఏదైనా పర్లేదు’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘జబర్దస్త్’ ఫేమ్ ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్’ శ్రీను, రాంప్రసాద్ ప్రధాన తారాగణంగా అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘3 మంకీస్’. నగేష్. జి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ‘సుడిగాలి’ సుధీర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పాత్ర చేశా. మా సినిమాకి ఊహించిన స్థాయిలో థియేటర్స్ రాకపోవడంతో కాస్త ఆందోళనగా ఉన్నాం. చిరంజీవిగారు మా ట్రైలర్ చూసి చాలా బాగుందన్నారు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తానన్నారు. నేను హీరోగా చేసిన ‘సాఫ్ట్వేర్ సుధీర్’కి మంచి వసూళ్లు వచ్చాయి. దానికి కారణం నేను ఫ్యామిలీలా భావించే నా ఫ్యాన్సే. హీరోగా ఓ సినిమా కమిట్ అయ్యాను. హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పుడే హీరో అనే ట్యాగ్ వద్దు’’ అన్నారు. -
ఇండస్ట్రీలోని త్రీ మంకీస్ మేమే
‘‘ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద వాళ్లున్నా నన్ను, మంచు లక్ష్మి, అలీని ఎందుకు పిలిచారు? మేం ముగ్గురం చేసే పిచ్చి చేష్టలు ఉహించుకొని, ఇండస్ట్రీలో ఉన్న త్రీ మంకీస్ మేమే అని మమ్మల్ని పిలిచినట్టున్నారు’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు అన్నారు. ‘జబర్దస్త్’ ఫేమ్ ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్’ శ్రీను, రాంప్రసాద్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘3 మంకీస్’. కారుణ్య చౌదరి హీరోయి¯Œ గా నటించారు. అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ .జి నిర్మించిన ఈ సినిమా రేపువిడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘సరిలేరు నీకెవ్వరు, శ్రీమంతుడు, ఘరానా బుల్లోడు’ లాంటి టైటిల్స్ ఏ హీరోకి పెట్టినా సరిపోతాయి. ‘3 మంకీస్’ టైటిల్ మాత్రం వీరికి తప్పితే మరెవరికీ పనికిరాదు’’ అన్నారు. ‘‘సినిమాలో నటించడం కంటే ‘జబర్దస్త్’ లో చేయడమే కష్టం’’ అన్నారు మంచు లక్ష్మి. ‘‘చిన్న సినిమాలను బతికిస్తే ఇండస్ట్రీతో పాటు చిన్న దర్శకులు బాగుంటారు’’అన్నారు నటుడు అలీ. ‘‘మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు నగేష్. ‘‘ఇలాంటి పాత్ర చేస్తానని జీవితంలో అనుకోలేదు’’ అన్నారు రాంప్రసాద్. ‘‘మా ముగ్గురికీ ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ రాదు’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘‘ఈ ప్రపంచంలో సాయం అనే మందు లేక చాలా మంది చనిపోతున్నారని మా చిత్రంలో చెప్పాం’’ అన్నారు అనిల్. హీరో ఆకాష్ పూరి, కారుణ్య చౌదరి, రచయిత అరుణ్, కెమెరామేన్ సన్నీ మాట్లాడారు. -
వీళ్లకి టీవీయే కరెక్ట్ అని మాత్రం అనుకోరు
‘‘త్రీ మంకీస్’ సినిమా టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమాలో నేను, సుధీర్, గెటప్ శ్రీను కోతి చేష్టలు చేస్తుంటాము’’ అన్నారు రాంప్రసాద్. ‘జబర్దస్త్’ ఫేమ్ సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించిన∙చిత్రం ‘త్రీ మంకీస్’. జి. అనిల్ కుమార్ దర్శకత్వంలో జి. నగేశ్ నిర్మించారు. ఈ నెల 7న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీకి రావాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. గలగల మాట్లాడుతూ, పంచ్‌లు వేస్తుంటే చుట్టుపక్కల వాళ్లు ‘నువ్వు ఇండస్ట్రీలో ఉండాల్సినవాడివి’ అనేవారు. దాంతో లగేజ్ సర్దుకుని హైదరాబాద్ వచ్చేశాను (నవ్వుతూ). కానీ ఇక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఎంతో స్ట్రగులయ్యాక ‘జబర్దస్త్’ టీవీ షో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ షో ద్వారా ‘ఆటో రాంప్రసాద్’గా పాపులరయ్యాను. ‘త్రీ మంకీస్’ కథ నచ్చి మేం సినిమా చేయాలనుకున్నాం. సరదాగా సాగిపోయే ముగ్గురు స్నేహితులకు ఒక సమస్య ఎదురవుతుంది. అందులో నుంచి ఎలా బయటపడ్డారు అన్నది కథాంశం. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం. ‘త్రీ మంకీస్’ చూసి వీళ్లకి టీవీయే కరెక్ట్ అని మాత్రం అనుకోరని చెప్పగలను. టీవీని, సినిమాను బ్యాలెన్స్ చేస్తూ పని చేయాలనుకుంటున్నాను. దర్శకత్వం చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి’’ అన్నారు. -
త్రీ మంకీస్ పైసా వసూల్ చిత్రం
‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘త్రీ మంకీస్’. జి. అనిల్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను జి. నగేష్ నిర్మించారు. కారుణ్య చౌదరి కథానాయిక. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ – ‘‘కామెడీతో పాటు అన్ని అంశాలుంటాయి. పక్కా పైసా వసూల్ చిత్రమిది’’ అన్నారు. ‘‘త్రీ మంకీస్’ చిత్రం మా బ్యానర్‌కి మంచి పేరు తీసుకొస్తుందనుకుంటున్నాను’’ అన్నారు నగేష్. ‘‘మేం ముగ్గురం కలసి సరదాగా నటించాం. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారనుకుంటున్నాను’’ అన్నారు సుధీర్. ‘‘రిలీజ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు గెటప్ శ్రీను. ‘‘సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు రాంప్రసాద్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి బాబు వాసిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ సాయి. -
మందిగిరి ఈవో రాంప్రసాద్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
-
ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్టీల్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆర్ధిక లావాదేవీల వివాదం వల్లే విజయవాడకు చెందిన వ్యాపారవేత్త కోగంటి సత్యం ఈ హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయమున్న ఐదుగురు కీలక నిందితులైన కోగంటి సత్యం, శ్యామ్, ప్రసాద్, ప్రీతమ్, రాములను మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్య కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ సోమవారం మీడియాకు వెల్లడించారు. భూ వివాదమే హత్యకు కారణమని... పక్కా పథకం ప్రకారమే రాంప్రసాద్‌ను హతమార్చారని...హత్యకు నెల రోజుల ముందు నుంచి రెక్కీ నిర్వహించారని డీసీపీ తెలిపారు. హత్య జరిగే సమయంలో కోగంటి సత్యం సోమాజిగూడ యశోదా ఆస్పత్రి సమీపంలోనే ఉన్నారని, హత్య జరిగిన తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. అయితే ఈ హత్య కేసులో తన ప్రమేయం లేకుండా ఉండేలా సత్యం జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. చదవండి: రాంప్రసాద్ హత్య కేసులో సంచలన నిజాలు కాగా రాంప్రసాద్, కోగంటి సత్యం చాలా ఏళ్లపాటు కలిసి వ్యాపారం చేశారని, ఈ నేపథ్యంలో కోగంటి సత్యంకు రూ.70కోట్లు రాంప్రసాద్ బాకీ పడ్డారన్నారు. అయితే రూ.23 కోట్లు చెల్లించేలా ఇరువురి మధ్య సెటిల్మెంట్ జరిగిందని, చెల్లించాల్సిన రుణాన్ని భారీగా తగ్గించినా రాంప్రసాద్ అప్పు తీర్చలేదని కోగంటి సత్యం ఆగ్రహంతో కక్ష కట్టినట్లు చెప్పారు. ఈ హత్య కోసం రూ.10 లక్షల సుపారీ ఇచ్చేందుకు సత్యం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు అనుచరుడు శ్యాం తన వాటర్ ప్లాంట్‌లోనే తయారైనట్లు చెప్పారు. కేసులో ప్రమేయం ఉన్న మరో ఆరుగురు పరారీలో ఉన్నారని డీసీపీ వెల్లడించారు. ఇక కోగంటి సత్యంపై 21 కేసులు ఉన్నాయని తెలిపారు. చదవండి: ‘రాంప్రసాద్‌ను చంపింది నేనే’ -
రాంప్రసాద్ హత్య కేసులో సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్ : క్రైమ్ సస్సెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న పారిశ్రామికవేత్త తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసును హైదరాబాద్ ట్రాన్స్‌ఫోర్స్ పోలీసులు చేధించారు. విజయవాడకు చెందిన కోగంటి సత్యం అనే వ్యాపారవేత్త ఈ హత్యకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మర్డర్‌లో మొత్తం 8 మంది హస్తం ఉందని, వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్పారు. శనివారం రాత్రి రాంప్రసాద్పై దాడి జరిగినప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సత్యంను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. సంచలన విషయాలను రాబట్టారు. (చదవండి : హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్త హత్య ) ఆరు నెలల ముందే రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. నెల రోజుల ముందే కోగంటి అనుచరుడు పంజాగుట్టలో ఓ గదిని రెంట్‌కు తీసుకున్నాడు. పక్కా ప్లాన్‌తో కోగంటి సత్యం డైరెక్షన్లోనే హత్య జరిగింది. తన పాత్రను బయటపెట్టకుండా కోగంటి జాగ్రత్త పడ్డాడు. రాంప్రసాద్ హత్యకు కోగంటి రూ.30 లక్షలు సుపారి ఇచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. కోగంటి వాడిన 5 సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు వాడిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అదుపులో ఉన్న వ్యక్తుల ఇచ్చిన వివరాల ఆధారంగా వాహనం, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ స్టీల్ వ్యాపారి బన్సల్ , హైదరాబాద్ కు చెందిన సియోట్ కంపెనీ ఓనర్లతో పాటు మరొకొంత మంది అనుమానితులను కూడా పోలీసులు విచారించనున్నారు. (చదవండి : టాస్క్‌ఫోర్స్ అదుపులో కోగంటి సత్యం) కాగా రాంప్రసాద్ ను హత్య చేసింది తానే అంటూ నిందితుడు శ్యామ్ మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే ఈ హత్యకు కోగంటికి సంబంధం ఎలాంటి సంబంధంలేదని చెప్పాడు. రాంప్రసాద్ వల్ల తీవ్రంగా నష్టపోయానని, ఆయన నుంచి తనకు రూ.15 లక్షలు రావాల్సి ఉందని పేర్కొన్నాడు. దీంతోపాటు రాంప్రసాద్ వద్ద కేసులు ఎదుర్కొంటూ అన్ని విధాలుగా నష్టపోయానన్నాడు. ఆ సందర్భంలో తనను కలిసిన రాంప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్ సుపారీ ఇచ్చాడని, రాంప్రసాద్‌ను హత్య చేస్తే రూ.30 లక్షలు చెల్లిస్తానంటూ ఒప్పందం చేసుకున్నట్లు వివరించాడు. దీంతో తన అనుచరులైన ఛోటు, రమేష్‌లతో కలిసి రాంప్రసాద్‌ను హత్య చేశానని పేర్కొన్నాడు. -
క్రైమ్ సస్సెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న రాంప్రసాద్ హత్య
-
హైదరాబాద్‌లో దారుణం
-
అన్నదానానికి రూ. లక్ష విరాళం
భద్రాచలం: శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, కృష్ణ జిల్లా, విజయవాడకు చెందిన లక్కరాజు రాంప్రసాద్, రమాదేవి దంపతులు రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఉదయం ఆలయానికి వచ్చిన వారు అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఏఈఓను కలిసి లక్కరాజు కమలాదేవి పేరు మీద ఈ విరాళాన్ని అందజేశారు. -
ఆయన్ను ఇరిటేట్ చేశాను!
‘ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు’లో ‘నాన్నా.. పూలు’ అని తండ్రిని ఏడిపించిన బుడతడు గుర్తుండే ఉంటాడు. ఇప్పుడు తనే హీరోగా మన ముందుకు రానున్నాడు. నాగ అన్వేష్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘వినవయ్యా రామయ్య’ నేడు తెరకొస్తోంది. ‘సిందూరపువ్వు’వంటి ఘనవిజయం అందించిన నిర్మాత కృష్ణారెడ్డి తనయుడే ఈ నాగ అన్వేష్. తనయుడు హీరోగా రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక, నాగ అన్వేష్ చెప్పిన ముచ్చట్లు.. *** చిన్నప్పట్నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. అరుణ్ పాండ్యన్ హీరోగా చేసిన ఓ సినిమాలో బాలనటుడిగా చేశా. ఆ సినిమా పేరు గుర్తు లేదు. ఆ సినిమా చూసి, ఈవీవీ సత్యనారాయణగారు నన్ను ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు’ సినిమాకి తీసుకున్నారు. ఆ సినిమా సెట్లో తెగ అల్లరి చేసేవాణ్ణి. ఇక వెంకటేశ్ అంకుల్నైతే ఆన్ స్క్రీన్లోనే కాకుండా, ఆఫ్ స్క్రీన్‌లో కూడా ఇరిటేట్ చేసేవాడిని. సౌందర్య ఆంటీ కూడా బాగా గారం చేసేవారు. ఆ చిత్రం తర్వాత ‘ఆయనగారు’, ‘నా హృదయంలో నిదురించే చెలి’, సైనికుడు (సాయికుమార్ హీరోగా నటించిన చిత్రం), ‘సాహసబాలుడు విచిత్రకోతి’ చిత్రాల్లో నటించాను. ఆ తర్వాత సినిమాలకు విరామం ఇచ్చి, చదువు కొనసాగించాను. *** నేను సీబీఐటీలో బీటెక్ చేశాను. కాలేజీలో కూడా నా మనసంతా సినిమాల పైనే. మా ఇంట్లో వాళ్లు సపోర్ట్ చేయడంతో హీరోగా అడుగులు వేయాలనుకున్నాను. దాంతో యాక్టింగ్ కోర్సు చేశాను. ఆ సమయంలోనే దర్శకుడు రామ్‌ప్రసాద్‌గారు ఈ కథ చెప్పారు. కథ బాగుండటంతో నాన్న ఓకే అన్నారు. *** ఈ చిత్రంలో బ్రహ్మానందం అంకుల్ కాంబినేషన్లో నటించాను. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. నేను హీరో అవుతానని చెప్పగానే... ‘హీరో అంటే ఎలా ఉండాలి? ఎలాంటి కథలు తీసుకోవాలి?’ అనే అంశాల గురించి చెప్పారు. బ్రహ్మానందంగారు నాకు గురువులాంటివారు. ప్రకాశ్రాజ్గారైతే ఏ సీన్లో ఎలా నటించాలి? అనే అంశాలపై చాలా సూచనలు, సలహాలు ఇచ్చారు. వాళ్లతో పనిచేయడం మర్చిపోలేని అనుభవం. *** రామ్‌ప్రసాద్‌గారు ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. లవ్ ట్రాక్, కామెడీతో సకుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు స్క్రిప్టే హీరో. ఈ సినిమా షూటింగ్ చాలా ఆహ్లాదంగా గడి చిపోయింది. నేను, కృతిక చిన్నవాళ్లమైనా చిత్ర బృందం అంతా చాలా బాగా సహకరించారు. పతాక సన్నివేశాల్లో ఆ అమ్మాయి నటన ఈ చిత్రానికే హైలైట్ అవుతుంది. వినాయక్గారైతే నన్ను ఇంటికి పిలిచి. నా యాక్టింగ్‌ను అభినందించారు. నాకు అల్లు అర్జున్ డాన్స్‌లు, నటన అంటే చాలా ఇష్టం. ‘రేసుగుర్రం’ సెట్లోనే అల్లు అర్జున్ గారిని కలిశాను. బ్రహ్మానందం గారే నన్ను ఆయనకు పరిచయం చేశారు. నాన్నగారు నిర్మాత అయినప్పటికీ నాకు నిర్మాణ రంగం మీద ఆసక్తి లేదు. ప్రస్తుతం నా దృష్టంతా నటనపైనే. -
టీచర్ ఘరానా మోసం
అనంతపురం: అనంతపురం జిల్లా కదిరిలో రాంప్రసాద్ అనే ఉపాధ్యాయుడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. వ్యాపారంలో నష్టపోయానంటూ రూ. 2 కోట్లకు ఐపీ పెట్టాడు. దీంతో అతనికి అప్పుగా ఇచ్చిన బాధితులు ఆందోళన చేపట్టారు. అతడు ఘరానా మోసానికి పాల్పడ్డాడని, ఎలాంటి వ్యాపారం చేయలేదంటూ వారు నినదించారు. దీనిపై పోలీసులు తగిన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. -
కన్పించేది ఎన్నికలప్పుడే..!
కామినేని మకాం అయితే అమెరికా.. లేకుంటే హైదరాబాద్ ఓడిన ఐదేళ్లకు కైకలూరు రాక అప్పుడు అన్నయ్య..ఇప్పుడు తమ్ముడి ప్రచారం గతంలోనూ కలిసిరాని సినీనటుల ప్రచారం కైకలూరులో ఫ్యాన్ గాలి జోరు గెలుపుదిశగా రామ్‌ప్రసాద్.. సాక్షి, మచిలీపట్నం/కైకలూరు, న్యూస్‌లైన్ : పెద్దగా పనులు చేయక్కర్లేదు కనీసం అందుబాటులో ఉంటే చాలు.. పంచభక్ష పరమాన్నం పెట్టక్కర్లేదు కనిపించినప్పుడు పలుకరిస్తే చాలు.. అందరివాడిగా ఉండే వాడినే ప్రజలు ఆదరిస్తారు.. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న రసవత్తరపోరులో సరిగ్గా ఇదే సీన్ కన్పిస్తోంది. ఒకరు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఉప్పాల రామ్‌ప్రసాద్ అయితే మరొకరు శ్రీమంతుడిగా పేరొందిన కామినేని శ్రీనివాస్. వీరద్దరి పోరును నిశితంగా గమనిస్తున్న కైకలూరు ప్రజలు ఓడినా గెలిచినా కామినేని శ్రీనివాస్ తమకు అందుబాటులో ఉండడని బాహాటంగానే చెబుతున్నారు. అందరికీ అనుకూలమైన, అందుబాటులో ఉండే రామ్‌ప్రసాద్‌ను గెలిపించుకుంటే ఐదేళ్లు తమవాడే ఎమ్మెల్యేగా ఉన్నాడన్న ఆనందం కలుగుతుందని కైకలూరు వాసులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా, ఇప్పుడు బీజేపీ నుంచి పోటీకి దిగిన కామినేని శ్రీనివాస్ అయితే అమెరికా లేకుంటే హైదరాబాద్‌లో ఉంటారని కైకలూరు వాసులు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో ఓడిన తరువాత హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. తన వారసులు అమెరికాలో స్థిరపడటంతో ఎక్కువగా అమెరికా వెళ్లొస్తుంటారు. ఓటమి అనంతరం ఐదేళ్లుగా ఆయన నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవు. మళ్లీ ఎన్నికలొచ్చాక బీజేపీ టికెట్ దక్కించుకుని డబ్బు సంచులతో దిగారని పలువురు పేర్కొం టున్నారు. కామినేని కోటీశ్వరుడు కాబట్టి డబ్బులు వెదజల్లుతారన్న ప్రచారం ఊపందుకుంది. సామాజి కంగా, ఆర్థికంగా బలమైన కామినేని రెండోసారి పోటీకి దిగడంతో ఆయన ఎన్నికల సమయంలో వస్తున్నారు తప్పా కైకలూరు నియోజకవర్గ వాసులను ఎప్పుడూ పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాడు అన్నయ్య.. ఇప్పుడు తమ్మయ్య ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన చిరంజీవి, పవన్‌కల్యాణ్ ఇప్పుడు వేర్వేరు రాజకీయ పార్టీల సేవలో తరిస్తున్నారు. రెండు ఎన్నికల్లోనూ మెగా అన్నదమ్ముల సేవలు కామినేనికి తప్పలేదు. 2009 ఎన్నికల్లో చిరంజీవి సర్వశక్తులు ఒడ్డి కామినేని కోసం ప్రచారం చేశారు. తాజా ఎన్నికల్లో పవన్ కైకలూరులో ఆదివారం ప్రచారం చేశారు. అన్నలానే సినీ డైలాగులు పేల్చారు. అయితే ఈ నియోజకవర్గంలో సినీ గ్లామర్ కలిసిరాదనే సంగతి తెల్సిన ప్రజలు పవన్ ప్రచారాన్ని సైతం పట్టించుకోలేదు. 1999 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన యర్నేని రాజారామచందర్ ఓటమి కోసం టీడీపీ తరఫున సినీనటి విజయనిర్మల ప్రచారం చేసినా యర్నేనికే ప్రజలు పట్టంకట్టారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రచారం చేసినా కామినేనికి ఓటమి తప్పలేదు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు తరఫున ఇటీవల చిరంజీవి, తాజాగా ఆదివారం కామినేని కోసం పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. రాజకీయ పరిణితికి నిదర్శనం జగన్ సభ రాజకీయ పరిణితికి నిలువెత్తు నిదర్శనం ఇటీవల కైకలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించిన జనభేరి అని పలువురు కొనియాడుతున్నారు. జగన్, పవన్ సభలను విశ్లేషకులు బేరీజు వేస్తున్నారు. పవన్ సభ చంద్రబాబు, మోడీల భజన సభగా మారిందని పెదవి విరిచారు. అన్న చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరి చంద్రబాబు, మోడీని ఉతికిపారేస్తుంటే, తమ్ముడు తగుదునమ్మా అంటూ అదే మోడీ, బాబును ప్రశంసించడం ఏమి రాజకీయమని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కైకలూరులో ఉప్పాల రామ్ప్రసాద్కే అనుకూల పవనాలు వీస్తున్నాయని, ఇక్కడ వైఎస్సార్ సీపీదే విజయమని విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. -
అనంతపురంలో రియల్టర్ రాంప్రసాద్ హత్య
నగర శివారులోని రియల్టర్ వ్యాపారి రాంప్రసాద్ యాదవ్‌పై ఆగంతకులు శనివారం ఉదయం వేటకోడవళ్లతో దాడి చేశారు. ఆ ఘటనలో అయన అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రాంప్రసాద్ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాంప్రసాద్‌కు ఎవరితో ఎటువంటి విబేధాలు లేవని ఆయన కుటుంభ సభ్యులు తెలిపారు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఆయన రియల్టీ వ్యాపారంలోకి ప్రవేశించారని చెప్పారు. వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో భాగంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.