అనంతపురంలో రియల్టర్ రాంప్రసాద్ హత్య | Realtor ramprasad murder in anatapuram | Sakshi
Sakshi News home page

అనంతపురంలో రియల్టర్ రాంప్రసాద్ హత్య

Published Sat, Aug 10 2013 11:10 AM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM

Realtor ramprasad murder in anatapuram

నగర శివారులోని రియల్టర్ వ్యాపారి రాంప్రసాద్ యాదవ్పై ఆగంతకులు శనివారం ఉదయం వేటకోడవళ్లతో దాడి చేశారు. ఆ ఘటనలో అయన అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

 

పోలీసులు రాంప్రసాద్ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాంప్రసాద్కు ఎవరితో ఎటువంటి విబేధాలు లేవని ఆయన కుటుంభ సభ్యులు తెలిపారు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఆయన రియల్టీ వ్యాపారంలోకి ప్రవేశించారని చెప్పారు. వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో భాగంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement