అనంతపురం : అనంతపురం జిల్లాలో హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా అనంతరం రైల్వేస్టేషన్ వద్ద తిరుమలరెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బుధవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తిరుమలరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా భూ తగాదాల కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.