
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే బిగ్‌బాస్ ఆరో సీజన్ 21 మంది కంటెస్టెంట్లతో మొదలైంది. షో ఇలా మొదలైందో లేదో అప్పుడే గొడవలు షురూ అయ్యాయి. ఆర్జీవీ హీరోయిన్ ఇనయ సుల్తానా ఎక్కువగా వాదనలకు దిగుతూ కనిపిస్తుండగా గీతూ ఛాన్స్ దొరికితే చాలు అందరినీ చెడుగుడు ఆడేసుకుంటోంది. ఆది, చలాకీ చంటి ప్రస్తుతానికైతే కామ్‌గా అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. మిగతా హౌస్‌మేట్స్ కూడా ఇప్పుడిప్పుడే ఆ వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే మొదటి రోజు నుంచే సింగర్ రేవంత్ ఎక్కువగా హైలైట్ అవుతున్నాడు. తన మాట వినాలన్న ధోరణి అతడిలో ఎక్కువగా కనిపిస్తోంది. కానీ ఇదే మిగతా కంటెస్టెంట్లకు నచ్చడం లేదు. వెరసి నామినేషన్‌లో అందరూ మనసులో ఉన్నదంతా కక్కేశారు. ఫలితంగా అందరికంటే ఎక్కువగా రేవంత్‌కు ఎనిమిది ఓట్లు పడ్డాయి. అయినా అతడికున్న పాపులారిటీతో ఈ గండాన్ని ఈజీగా దాటేస్తాడు. అతడి అత్యుత్సాహాన్ని కాసేపు పక్కనపెడితే రేవంత్ ఎందుకో ప్రతిదానికీ తెగ ఎమోషనల్ అవుతున్నాడు. అప్పుడే గట్టిగా మాట్లాడతాడు, అంతలోనే సైలెంట్ అయిపోతాడు, ఎవరికీ కనిపించకుండా బాత్రూం ఏరియాలోకి వెళ్లి ఏడ్చేస్తాడు. అతడి ప్రవర్తనే ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది. తాజాగా రిలీజైన ప్రోమోలో కూడా అతడే హైలైట్ అయ్యాడు.
'నామినేషన్‌లోకి రావడం పాపం కాదు, జనాలు నిన్నేమీ బూతులు తిట్టుకోరు' అంటూ నామినేషన్స్ హీట్ నుంచి రేవంత్‌ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆదిత్య. అయితే గీతూ మాత్రం ఆయన ఎంత త్వరగా బయటకు వెళ్తే ఆయనకే మంచిది అని వేదాంతం పలికింది. ఆయన కనక హౌస్‌లో ఇదే బిహేవియర్‌తో కొనసాగితే మాత్రం జనాలు.. ఇంత పెద్ద సింగర్, ఇట్ల చేస్తున్నాడేంది అనుకోవడం ఖాయం అని అభిప్రాయపడింది. మరి రేవంత్ తన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుని గేమ్‌పై ఫోకస్ పెడ్తాడా? లేడా? అనేది చూడాలి!
చదవండి: చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది: యాంకర్, నటి
లైగర్ ఎఫెక్ట్: అద్దె ఇల్లు ఖాళీ చేసిన పూరీ
Comments
Please login to add a commentAdd a comment