Bigg Boss Telugu 6: Baladitya Says He Apologise Geetu Royal Mother - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: గీతూ తల్లికి ఫోన్‌ చేసి మాట్లాడా: బాలాదిత్య

Published Sun, Nov 20 2022 3:28 PM | Last Updated on Mon, Nov 21 2022 3:40 PM

Bigg Boss Telugu 6: Baladitya Says He Apologise Geetu Royal Mother - Sakshi

బిగ్‌బాస్‌ షోలో మిస్టర్‌ పర్ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు బాలాదిత్య. కానీ ఒక్క సిగరెట్‌ కోసం ఏడ్చి, నానా రభస చేసి, గీతూపై నోరు జారి పెద్ద తప్పే చేశాడు. అయినా సరే అప్పటికే మంచి పేరు ఉండటంతో బాలాదిత్య ఆఫ్ట్రాల్‌ సిగరెట్‌ కోసం అంత గొడవపడ్డా అతడికే మద్దతు పలికారు ఫ్యాన్స్‌. బదులుగా అతడిని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్‌ చేసిన గీతూను బయటకు పంపించి తగిన బుద్ధి చెప్పారు. తాజాగా అతడు సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

'నేను బిగ్‌బాస్‌ షో గెలవలేకపోవచ్చు. కానీ మన ఇంట్లో ఇలాంటి మనిషి ఉండాలని ఎంతోమంది కోరుకున్నారు. అది చాలు.. నన్ను పెంచిన తల్లిదండ్రులు, గురువుల వల్లే నాకు అంతటి పేరొచ్చింది. ఇకపోతే నాకు సిగరెట్‌ వీక్‌నెస్‌ కాదు. కానీ బయటకు అది నెగెటివ్‌గా వెళ్తుందని అర్థమై సిగరెట్లు తాగడమే మానేశాను. సిగరెట్ల విషయంలో గీతూను తిట్టినందుకు ఆమె తల్లికి ఫోన్‌ చేసి సారీ చెప్పాను' అని చెప్పాడు బాలాదిత్య.

చదవండి: టాప్‌ 10లో నుంచి ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌ ఎవరంటే?
శ్రీహాన్‌.. మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా నీలో.. ఆట్‌ కమల్‌ హాసన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement