Bigg Boss 6 Telugu: Nagarjuna Exposed Inaya - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: గీతూ బద్ధకం వల్ల బలైపోయిన శ్రీహాన్‌, వీడియోతో పరువు పాయే!

Nov 5 2022 11:59 PM | Updated on Nov 6 2022 8:48 AM

Bigg Boss 6 Telugu: Nagarjuna Exposed Inaya  - Sakshi

కెప్టెన్సీలో నువ్వేం పొడిచావో చెప్పమని అడగడంతో అతడు నీళ్లు నమిలాడు. లాస్ట్‌ వీక్‌ గీతూకు వాష్‌రూమ్స్‌ కడగాలని ఇచ్చిన పనిష్మెంట్‌ ఎందుకు తగ్గించావని ప్రశ్నించాడు. ఆదిరెడ్డి సాయం చేస్తుంటే చూస్తూ కూర్చున్నావెందుకని నిలదీశాడు.

Bigg Boss Telugu 6, Episode 63: ఈ వారం జరిగిన కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌లో రెడ్‌, బ్లూ టీమ్‌ మెంబర్స్‌కు ర్యాంకులివ్వమని గీతూ, ఆదిరెడ్డిలను ఆదేశించాడు నాగ్‌. బ్లూ టీమ్‌ లీడర్‌ ఆది రెడ్డి.. రాజ్‌ ఫస్ట్‌, ఇనయ సెకండ్‌ అని చెప్పి మెరీనా, వాసంతి, బాలాదిత్య, రోహిత్‌లకు వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు ర్యాంకులిచ్చాడు. తనకు ఏడో ర్యాంకు ఇచ్చుకున్నాడు ఆది. ఈ సందర్భంగా నాగ్‌.. సిగరెట్ల కోసం గీతూను నానామాటలు అన్నావు, సిగరెట్‌ తాగగానే సారీ చెప్పావు అంటూ బాలాదిత్య మీద వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దీంతో అతడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక మీదట సిగరెట్‌ ముట్టుకోనని శపథం చేశాడు. ఆట అయిపోయాక బాలాదిత్య బలహీనత మీద ఆడుకోవడం కరెక్ట్‌ కాదని గీతూకు కూడా హితవు కలిపాడు నాగ్‌.

రెడ్‌ టీమ్‌ లీడర్‌ గీతూ.. శ్రీహాన్‌కు ఫస్ట్‌, ఫైమాకు సెకండ్‌, శ్రీసత్య, రేవంత్‌, కీర్తిలకు మూడు, నాలుగు, ఆరో ర్యాంకులిచ్చింది. తనకు తాను మాత్రం ఐదో ర్యాంకిచ్చుకుంది. రేవంత్‌ ఉన్మాదిలా ఆడిన వీడియోను చూపించాడు నాగ్‌. అందులో అతడు ఇనయను బలంగా నెట్టేశాడు. నువ్వు ఇంకా నీ కోపాన్ని తగ్గించుకోవాలని వార్నింగ్‌ ఇచ్చాడు. తర్వాత శ్రీహాన్‌ను.. కెప్టెన్సీలో నువ్వేం పొడిచావో చెప్పమని అడగడంతో అతడు నీళ్లు నమిలాడు. లాస్ట్‌ వీక్‌ గీతూకు వాష్‌రూమ్స్‌ కడగాలని ఇచ్చిన పనిష్మెంట్‌ ఎందుకు తగ్గించావని ప్రశ్నించాడు. ఆదిరెడ్డి సాయం చేస్తుంటే చూస్తూ కూర్చున్నావెందుకని నిలదీశాడు. వీడియో వేసి మరీ చూపించడంతో అడ్డంగా దొరికిపోయిన శ్రీహాన్‌ తప్పు తనదేనని ఒప్పుకున్నాడు. తప్పు చేసినందుకు ఫలితంగా నెక్స్ట్‌ వీక్‌ కెప్టెన్సీకి పోటీపడే అర్హత కోల్పోయావన్నాడు నాగ్‌. అనంతరం బ్లూ టీమ్‌లో ఆది, రెడ్‌ టీమ్‌లో గీతూకు వరస్ట్‌ పర్ఫామర్‌ ట్యాగిచ్చాడు. తర్వాత ఆది, కీర్తి, రేవంత్‌ సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు.

ఇక బిగ్‌బాస్‌ ఇంటి విషయాల గురించి నాగ్‌ మాట్లాడుతూ.. ఇంట్లో ఫుడ్‌ సరిపోవట్లేదంటున్నారు. ఆల్‌రెడీ మీకు కావాల్సినంత ఫుడ్‌ బిగ్‌బాస్‌ పంపిస్తూనే ఉన్నాడు. అయినా ఎందుకా సమస్య తలెత్తుతోందని హౌస్‌మేట్స్‌ను అడిగాడు. వేస్ట్‌ చేసిన ఫుడ్‌ వీడియోను చూపించి తప్పు మీ దగ్గరే ఉందని నిందించాడు. తనను టార్గెట్‌ చేస్తున్నారని పదే పదే వాదిస్తున్న ఇనయ తనకు ఏదైనా కావాలంటే ముందుగా కెప్టెన్‌కు చెప్పమని సూచించాడు. అందరూ రెండుసార్లు టీ తాగినంత మాత్రాన నీకు రెండుసార్లు పాలు ఇవ్వడం ఎలా కుదురుతుందని ప్రశ్నించాడు. ఇకపోతే శ్రీహాన్‌ను నువ్వెక్కడ పడుకుంటున్నావో చూస్తున్నా అనడం తప్పని స్పష్టం చేశాడు. దానికి ఇనయ తాను వేరే ఇంటెన్షన్‌తో అన్నానని ఆన్సరివ్వగా కెమెరాలు చూస్తున్నాయి, ఎంత కవర్‌ చేసినా దొరుకుతావు ఇనయ.. అని గద్దించాడు. దీంతో ఆమె కిమ్మనకుండా సైలెంట్‌ అయిపోయింది. ఇదిలా ఉంటే రేపటి ఎపిసోడ్‌లో గీతూ ఎలిమినేట్‌ అవగా నేను వెళ్లనంటూ ఏడుపందుకుందట. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..

చదవండి: షాకింగ్‌ ఎలిమినేషన్‌, గీతూ రాయల్‌ అవుట్‌
ఇనయపై సూర్య ప్రతీకారం? ఆ పోస్ట్‌తో క్లారిటీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement