Bigg Boss Telugu 6: Baladitya Is Worst Performer Of 8th Week | Bigg Boss 6 Telugu Episode 55 Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఇనయ- శ్రీహాన్‌ లొల్లి.. ఇలాగైతే సీజన్‌ హిట్‌ అంటున్న గీతక్క

Published Fri, Oct 28 2022 11:51 PM | Last Updated on Sun, Oct 30 2022 6:20 PM

Bigg Boss Telugu 6: Baladitya is Worst Performer of 8th Week - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 55: ముందుగా అనుకున్నట్లుగానే శ్రీహాన్‌ కెప్టెన్‌ అయ్యాడయ్యాడు. అలా కెప్టెన్‌ అయ్యాడో లేదో ఇలా ఇనయతో గొడవపడ్డాడు. మొన్నటిదాకా కలిసిపోయిన వీళ్లిద్దరి కథ కెప్టెన్సీ టాస్క్‌తో మళ్లీ మొదటికి వచ్చింది. ఇనయ కత్తిపోటు వేయడాన్ని శ్రీహాన్‌ జీర్ణించుకోలేకపోయాడు. సరైన సమయం వచ్చినప్పుడు తనేంటో చూపిస్తాననడి డిసైడ్‌ అయ్యాడు. మరి నేటి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి..

సూర్య, ఇనయల ట్రాక్‌ చూసి జనాలు వీరిని సునయ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ నాగార్జున వీకెండ్‌లో పదేపదే బుజ్జమ్మ పేరు ఎత్తడంతో ఇనయ బాగా హర్టయింది. సూర్యకు గర్ల్‌ఫ్రెండ్‌ ఉందని అన్నిసార్లు గుర్తు చేసినప్పుడు తను క్లోజ్‌గా ఉండటం తప్పని భావించింది. ఏకంగా అతడి ఫ్రెండ్‌షిప్‌నే వద్దంది. సూర్య మీద ద్వేషం పెంచుకుంది. టాప్‌ 5లో కాదు కదా వీలైనంత వెంటనే బయటకు వెళ్లిపోవాలని రగిలిపోయింది. కానీ ఆ కోపం చప్పున చల్లారిపోయినట్లు కనిపిస్తోంది. 

నాకు కోపమొస్తే అవతలివారిని బాధపెడతాడనని సూర్యతో చెప్పుకొచ్చింది ఇనయ. నీ బ్రాస్‌లేట్‌ రేవంత్‌ దగ్గర ఉండటం నచ్చలేదు, అందుకే తీసుకున్నానన్నాడు సూర్య. అలా ఇద్దరూ కాసేపు  మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్సీ పోటీ కంటిన్యూ అయింది. నిన్న రాజ్‌, రోహిత్‌, రేవంత్‌.. సూర్యకు; బాలాదిత్య, గీతూ.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చగా ఇనయ.. శ్రీహాన్‌కు కత్తి గుచ్చింది. నేటి ఎపిసోడ్‌లో వాసంతి, ఆదిరెడ్డి, మెరీనా, ఫైమా.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చారు. తక్కువ కత్తులు దిగిన శ్రీహాన్‌ కెప్టెన్‌గా అవతరించాడు.

మరోవైపు కిచెన్‌లో గీతూ, బాలాదిత్య పంచాయితీకి దిగారు. కూరగాయలు కట్‌ చేసినప్పుడు దాని తొక్కలు డస్ట్‌బిన్‌లో వేయొచ్చు కదా అని బాలాదిత్య.. నేను ఎందుకు వేస్తా, అంత అవసరమనుకుంటే నువ్వే వేసేయ్‌ అంటూ గీతూ దెబ్బలాడుకున్నారు. అలా ఇద్దరి గొడవతో ఇంట్లో రగడ జరిగింది. తర్వాత యమహా కాల్‌ ఆఫ్‌ ద బ్లూ టాస్క్‌లో రోహిత్‌ గెలిచి జాకెట్‌ గెలుచుకున్నాడు. తనను విన్నర్‌గా ప్రకటించకపోవడంతో రేవంత్‌ చిర్రుబుర్రులాడాడు.

అనంతరం వరస్ట్‌ పర్ఫామర్‌ను ఎంచుకోమని కెప్టెన్‌ శ్రీహాన్‌ను ఆదేశించాడు బిగ్‌బాస్‌. దీంతో కెప్టెన్‌.. బాలాదిత్య ముఖానికి పెయింట్‌ పూయడంతో అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. గీతూ ప్రవర్తన మీద ఓ కన్నేసిన ఆది రెడ్డి తన అభిప్రాయాన్ని ఆమె ముందుంచాడు. గీతక్క నువ్వు రాంగ్‌ ట్రాక్‌లో వెళ్తున్నావనిపిస్తోందన్నాడు. ఆమె మాత్రం అదేమీ పెద్దగా పట్టించుకోనట్లే కనిపించింది. ఇక ఆది కూతురు హద్విత ఫస్ట్‌ బర్త్‌డే కావడంతో అతడికి ఫ్యామిలీ వీడియో చూపించాడు బిగ్‌బాస్‌. ఆ వీడియోలో ఆది భార్య కవిత కూతురికి కేక్‌ కట్‌ చేసి తినిపించింది. తన తల్లిని, పెళ్లాంబిడ్డలను చూసి ఆది సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు.

కెప్టెన్‌ శ్రీహాన్‌ ఇంటిసభ్యులకు పనులు అప్పగించేందుకు రెడీ అయిపోయాడు. ఇనయను వంట చేయమని అడిగాడు. దీనికి ఇనయ స్పందిస్తూ.. 'నేను చివరిసారిగా వంట చేసింది మా డాడీకే, నా వంట తిన్నాక ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటినుంచి వంట ముట్టుకోలేదు, ఇక మీదట చేయను కూడా' అని తెగేసి చెప్పింది.

కొందరు అన్నం వదిలేస్తున్నారని శ్రీహాన్‌ అనగా కూర లేకపోవడంతోనే తాను రైస్‌ పక్కన పెట్టేశానని మధ్యలో కల్పించుకుని ఆన్సరిచ్చింది ఇనయ. అసలు నీ పేరు ప్రస్తావించనప్పుడు నువ్వెందుకు మధ్యలో వస్తున్నావంటూ ఫైర్‌ అయ్యాడు కెప్టెన్‌. అలా ఇద్దరి మధ్య కాసేపు చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఏదేమైనా అన్నం పడేస్తే మాత్రం అస్సలు ఊరుకోనన్నాడు శ్రీహాన్‌. మళ్లీ గొడవలవుతున్నాయని శ్రీహాన్‌ చిరాకుపడుతుంటే గీతూ మాత్రం.. ఇలా గొడవ జరిగితేనే సీజన్‌ హిట్టవుతుందని చెప్పుకురావడం విశేషం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement