
బిగ్‌బాస్ హౌస్‌లో సాఫ్ట్ అండ్ స్వీట్‌గా నడుచుకునే వ్యక్తి బాలాదిత్య. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇతడు బిగ్‌బాస్ షోతో జనాలకు మరింత దగ్గరవ్వాలనుకున్నాడు. కానీ అతి మంచితనమే అతడికి శత్రువుగా మారింది. ఇది నిజంగా మంచితనమేనా? సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఫేక్ కంటెస్టెంట్ అని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎన్ని విమర్శలు వచ్చినా సరే అతడు మాత్రం ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు.
ఇకపోతే ఇటీవల బ్యాటరీ రీచార్జ్ టాస్క్‌లో బాలాదిత్య తన సిగరెట్లు త్యాగం చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే అతడు సిగరెట్లు మానేలా చేసింది గీతూ. బ్యాటరీ రీచార్జ్ అవ్వాలంటే ఇంటిసభ్యులు చక్కెర త్యాగం చేయాలి, లేదంటే బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేయాలని గీతూకు పిలిచి చెప్పాడు బిగ్‌బాస్. దొరికిందే ఛాన్స్ అనుకున్న గీతూ.. ఇంటిసభ్యులు ఫుడ్ మానేయమడా? లేదా బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేస్తాడా? తేల్చుకోమని బిగ్‌బాస్ చెప్పాడంది. దీంతో ఆదిత్య ముందుకు వచ్చి పొగ తాగడాన్ని వదిలేశాడు. కానీ ఇప్పటికీ కెమెరాల ముందుకు వచ్చి సిగరెట్లు పంపించమని బతిమిలాడుతూనే ఉన్నాడు.
ఈ వ్యవహారంపై బాలాదిత్య భార్య మానస స్పందించింది. 'బాలాదిత్య సిగరెట్లు తాగడం మానేయాలనుకుంటే మానేయగలడు. హనుమాన్ మాల వేసుకున్నప్పుడు 40 రోజులు ఒక్క సిగరెట్ ముట్టుకోలేదు. అయితే గీతూ అందరి ఎదుట సిగరెట్ మానేయాలని చెప్పడం బాగోలేదు. అది తన వీక్‌నెస్ అని తెలిసి, తనతో ర్యాపో ఉన్నప్పుడు నేరుగా వెళ్లి ఆయనకే చెప్తే బాగుండని ఆదిత్య అనుకున్నాడు. అతడితో స్మోకింగ్ మానిపించాలన్నదే ఆమె ఉద్దేశ్యం. దాన్ని నేను తప్పుపట్టను' అని చెప్పింది.
చదవండి: ఇనయనే వెంటపడుతోంది.. సూర్య గర్ల్‌ఫ్రెండ్
లుండీ డ్యాన్స్‌తో రచ్చ లేపిన కీర్తి సురేశ్
Comments
Please login to add a commentAdd a comment