ఫ్రెండ్ అంటూనే వెన్నుపోటు పొడిచిన ఇనయపై కసి పెంచుకున్నాడు శ్రీహాన్. సమయం వచ్చినప్పుడు తనేంటో చూపిస్తానని డిసైడ్ అయ్యాడు. ఎలాగో అతడు కెప్టెన్ అయిన విషయం బయటకు రానే వచ్చింది. తాజాగా అతడు ఇంటిబాధ్యతలు చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఇంట్లో కొందరు అన్నం వదిలేస్తున్నారని శ్రీహాన్ చెప్తుండగా మధ్యలో ఇనయ కల్పించుకుని నాకు కూర సరిపోలేదని అన్నం వదిలేశానని క్లారిటీ ఇచ్చింది.
దీంతో శ్రీహాన్ ఫైర్ అవుతూ.. 'నేను మాట్లాడినప్పుడు కాదు, తర్వాత క్లారిటీ ఇచ్చుకో! నేను అందరి పాయింట్స్ చెప్తున్నప్పుడు కామ్‌గా ఉండు, తర్వాత మాట్లాడుకో' అంటూ ఒంటికాలిపై లేచాడు. కర్రీ వేయలేదు కాబట్టే తినలేదని ఇనయ మరోసారి చెప్పగా అన్నానికి నువ్విచ్చే విలువ అదా? నా కళ్ల ముందు ఎవరైనా రైస్ పడేసినట్లు కనిపిస్తే అస్సలు ఊరుకోను అని హెచ్చరించాడు కొత్త కెప్టెన్. ఈరోజు ఆదిరెడ్డి కూతురు బర్త్‌డే కావడంతో బిగ్‌బాస్ అతడి కోసం స్పెషల్ వీడియో ప్లే చేశాడు. అది చూసి ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. మరోపక్క వరస్ట్ పర్ఫామర్‌గా ఎవరిని సెలక్ట్ చేయాలన్న బాధ్యతను కెప్టెన్ శ్రీహాన్‌కు ఇచ్చాడు బిగ్‌బాస్. అతడు సత్య, గీతూల కోపం అర్థం చేసుకున్నాడో ఏమో కానీ బాలాదిత్యను జైలుకు పంపించినట్లు తెలుస్తోంది.
చదవండి: తొక్కలో పంచాయితీ, ఎంత చెప్పినా గీతూ వినదే
ఒక్క పోస్ట్‌తో లవ్ కన్‌ఫర్మ్ చేసిన హీరో సిద్దార్థ్
Comments
Please login to add a commentAdd a comment