బిగ్‌బాస్ షోలో ఏ బంధమైనా తనకు ఆట తర్వాతే అంది గీతూ. అందుకే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో బిగ్‌బాస్ భుజబలమే కాదు బుద్ధి బలం కూడా వాడొచ్చు.. అన్న ఒక్క పాయింట్‌ను పట్టుకుని గేమ్‌ను ఎన్నో మలుపులు తిప్పింది. మొదటగా బాలాదిత్య వీక్‌నెస్ అయిన సిగరెట్లను దాచేసి అతడిని నానా హింసించింది. గేమ్‌లోనూ, గేమ్ అయిపోయాక కూడా సిగరెట్లు ఇచ్చేదేలేదని మొండికేసింది. ఈ గొడవను వీకెండ్‌లో లేవనెత్తాడు నాగ్.
ముందుగా బ్లూ టీమ్ లీడర్‌ను తన టీమ్ మెంబర్స్‌కు ర్యాంకులివ్వమన్నాడు. ఆదిరెడ్డి.. బాలాదిత్యకు 5వ ర్యాంకిచ్చాడు. దీంతో నాగ్.. నీకేసిన నంబర్ కూడా సిగ్గుపడి వెనక్కు తిరిగిందని బాలాదిత్య పరువు తీశాడు. సిగ్గుండాలి, మనిషివేనా, ప్రేమతో ఆడుకుంటావా? ఇంగిత జ్ఞానం ఉందా?... ఆఫ్టరాల్ సిగరెట్ కోసం ఇన్ని మాటలు అనాలా? అని అడిగాడు నాగ్. అవన్నీ కోపంలో అనలేదని, బాధతో అలా మాట్లాడానని సంజాయిషీ ఇచ్చుకున్నాడు బాలాదిత్య. అటు గీతూ మాత్రం.. 'ఎన్ని మాటలన్నా ఫీలవలేదని, కానీ.. ఇన్నిరోజులు నువ్వు నటిస్తున్నావంటే నేను నమ్మలేదు, ఇప్పుడు నమ్మాలనిపిస్తోంది అన్న ఒక్క మాటకు నా గుండె పగిలిపోయింది సర్' అని ఆన్సరిచ్చింది. ఆటలో సిగరెట్లు దాచడం కరెక్టే, కానీ ఆట అయిపోయాక కూడా అతడి బలహీనత మీద ఆడుకోవడం సరికాదని చెప్పాడు నాగ్.
చదవండి: ఇనయపై సూర్య ప్రతీకారం, ఆ పోస్టులతో క్లారిటీ!
గీతూ రాయల్ ఎలిమినేట్
Comments
Please login to add a commentAdd a comment