
ప్రతీకాత్మక చిత్రం
విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏపీ అండ్ తెలంగాణా) కన్వీనర్ పేరం శివ నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడలో పేరం శివ నాగేశ్వరరావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అన్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. వైఎస్ జగన్ ప్రత్యేక హోదా విషయంలో ముందు నుంచి ఒకే మాట మీద నిలబడ్డారని కొనియాడారు. పోలవరం, రాజధానికి కేంద్రం నిధులు ఇస్తే చంద్రబాబు వాటికి లెక్కచూపటం లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్‌ను దోషిగా చూపించాలని చంద్రబాబు ప్రతీ పసుపు కార్యకర్తను పురమాయించాడని ఆరోపించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముద్దాయిగా చూపడానికి వీరేమైనా న్యాయమూర్తులా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న కేసులలో నేరం నిరూపణ కాలేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్‌కు కేసీఆర్ మద్ధతు ఇస్తే చంద్రబాబు నాయుడికి ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు కేజ్రీవాల్, మమతా బెనర్జీల మద్దతు తీసుకోలేదా అని అడిగారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేలా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఏపీలో తాము పోటీ చేస్తున్నా కూడా వైఎస్సార్‌సీపీకే మద్దతు తెలుపుతున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment