సాక్షి, విజయవాడ : టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారమోనని వారి ఓట్లను తీసేసిన ఘటన లబ్బిపేటలో చోటుచేసుకుంది. లబ్బిపేట బూత్ నెం 81లో దాదాపు వెయ్యి ఓట్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే తమ ఓట్లు తీసేసిందని ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. తమకు చంద్రబాబు వాయిస్ కాల్ వచ్చిందని.. ప్రభుత్వ పనితీరు గురించి ఆరా తీశారని తెలిపారు.
తాము వ్యతిరేకంగా సమాధానం చెప్పడంతోనే.. తమ ఓట్లను తొలగించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని దాన్ని కాలరాస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఓటు హక్కు కల్పించే వరకు బూత్ నుంచి కదిలేది లేదని బైఠాయించారు. చంద్రబాబే తమ ఓట్లను తీయించారని బాధితులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment