విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావు
విజయవాడ: విజయవాడ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో భద్రత పర్చామని విజయవాడ నగర సీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. విజయవాడలో తిరుమల రావు బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలకు 4 స్ట్రాంగ్‌రూంలు కేటాయించామని, మొత్తం 28 స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు భద్రపరిచినట్లు తెలిపారు. ప్రతి స్ట్రాంగ్‌రూమ్‌కి 2 తాళాలు ఉన్నాయని చెప్పారు.
మొదటి అంచెలో స్ట్రాంగ్ రూం వద్ద సీఆర్‌పీఎఫ్ పహారా, రెండో అంచెలో ఏపీఎస్‌పీ సిబ్బంది, మూడో అంచెలో లోకల్ పోలీసులు పహారా కాస్తారని తెలిపారు. ఎవరు లోపలికి వెళ్లినా లాగ్ బుక్‌లో నమోదు చేస్తారని స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తం 28 సీసీ కెమెరాలు ఉన్నాయని, సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారని వెల్లడించారు. అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలి అనుమతి ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించి లోపలికి చొరబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment