
సాక్షి, విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై విజయవాడ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. క్యూలో నిలబడిన తమని తోసి మరి తన ఓటుహక్కును వినియోగించుకున్నారని, ఎన్నికల అధికారులు పవన్ కల్యాణ్‌కు ఏమైనా ప్రత్యేక అధికారాలు కల్పించారా? అంటూ నిలదీశారు. సీఎం అభ్యర్థిగా చెప్పుకునే పవన్.. కనీస నిబంధనలు పాటించరా? అంటూ ఫైర్ అయ్యారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్ నుంచి వచ్చామని, ఉదయం అల్పహారం తీసుకోకుండా క్యూలైన్‌లో నిల్చున్నామన్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం వస్తూనే క్యూలో నిల్చున్న ఓటర్లను తోసుకుంటూ పోలింగ్ బూత్‌లకు వెళ్లిపోయారని, ఇది ఏమైనా భావ్యమా? అని న్యూస్ 18 చానెల్‌తో మాట్లాడుతూ ప్రశ్నించారు. ఇక విజయవాడ పటమటలో పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే.
ఇక గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అన్నయ్య.. మెగాస్టార్ చిరంజీవిని కూడా ఓ ఓటరు క్యూలైన్ విషయం నిలదీశారు. అప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి క్యూలైన్ కాదని పోలింగ్ స్టేషన్‌కు వెళ్లడానికి ప్రయత్నించగా కార్తీక్ అనే ఎన్‌ఆర్‌ఐ అడ్డుకున్నారు. ‘మీరు వీఐపీ అయితే మాత్రం కుటుంబ సభ్యులందరితో కలిసి క్యూలైన్ దాటి ముందుకు వెళ్లాలా..?’ అని నిలదీశారు. తాను ఓటు వేసేందుకు లండన్ నుంచి వచ్చానని.. ఓటు వేసిన అనంతరం తిరిగి లండన్ వెళ్లాల్సి ఉందని చెప్పారు. దీంతో కంగుతిన్న చిరంజీవి తిరిగి వెనక్కి వెళ్లిపోయి క్యూలైన్‌లో నిలుచున్నారు.
Comments
Please login to add a commentAdd a comment