
రావంత్, సలోని జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజుకు నచ్చిందే రంభ’. ర్యాలీ శ్రీనివాసరావు దర్శకత్వంలో వి. చిన్న శ్రీశైలం యాదవ్ సమర్పణలో దేవరపల్లి అఖిల్, వల్లాల ప్రవీణ్‌కుమార్ యాదవ్ (వెంకట్) నిర్మిస్తున్నారు. ర్యాలీ శ్రీనివాసరావు మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. ఒక హీరోయిన్‌గా సలోని నటిస్తుండగా, మరో హీరోయిన్‌ని త్వరలోనే ఎంపిక చేస్తాం’’ అన్నారు.
‘‘ఇది నాకు ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. చంద్రబోస్, రామజోగయ్యల పాటలకి నా మార్క్ మిస్ కాకుండా బాణీలు ఇస్తా’’ అన్నారు సంగీత దర్శకుడు రఘు కుంచె. ఈ చిత్రానికి కెమెరా: జవహర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కృష్ణ మోహన్ రావు, లక్ష్మీ నారాయణ చౌదరి, శ్రీనివాసరావు కాంతి, లైన్ ప్రొడ్యూసర్: కావిడి ఆనంద్, సహనిర్మాతలు: వల్లాల రమేష్ యాదవ్, ఎ. రాజు సాగర్, కోన సత్యనారాయణ చౌదరి
Comments
Please login to add a commentAdd a comment