![Last Ride Funeral Service Launched By The VC Sajjanar - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/5/VC.jpg.webp?itok=QU0Nu9eL)
ప్రారంభించిన సీపీ సజ్జనార్.. సైబరాబాద్ పరిధిలో సేవలు
రాయదుర్గం: కరోనాతో చనిపోయిన వారిని ఖనన స్థలానికి తరలించేందుకు వీలుగా ఏర్పాటుచేసిన ‘లాస్ట్ రైడ్ సర్వీస్’అంబులెన్స్ వాహనాన్ని శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో కమిషనర్ వీసీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. సజ్జనార్ మాట్లాడుతూ కరోనాతో మృతిచెందిన వారిని ఆస్పత్రి నుంచి ఖననానికి తీసుకెళ్లడం, ఖననం చేయడం సమస్యగా మారిందన్నారు. అటువంటి సమయంలో ఫీడ్ ది నీడీ టీమ్ కరోనా, నాన్ కరోనా మృతుల ఖననం కోసం ఈ వాహన సేవలను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం విజయకుమార్, ఫీడ్ ది నీడీ టీమ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, ఎన్‌జీఓ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ప్రతినిధి కళ్యాణ్ రూ.50 వేల చెక్కును సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు అందించారు.
లాస్ట్ రైడ్ సర్వీస్ సేవలిలా..
కరోనాతో లేదా ఇతరత్రా చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేసే స్థలానికి అంబులెన్స్ ద్వారా ఉచితంగానే తరలిస్తారు. రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వర కు ఈ వాహనం అందుబాటులో ఉంటుంది. సంప్రదించాల్సిన నంబర్: 84998 43545.
Comments
Please login to add a commentAdd a comment