ప్రముఖ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ డిజిటల్ పేమెంట్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఫేస్‌బుక్ లో ఫేస్‌బుక్ పే పేరుతో అమెరికాలో లాంచ్ చేసింది. ఫేస్‌బుక్ సొంతమైన వాట్సాప్, మెసెంజర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డిజిటల్ లావాదేవీల సౌలభ్యాన్ని త్వరలోనే వినియోగదారులకు అందించనుంది.
కాలక్రమేణా ఎక్కువ మందికి, ఎక్కువ ప్రదేశాలకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నామని ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్ అండ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ డెబోరా లియు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో పనిచేసే కొత్త చెల్లింపుల వ్యవస్థను త్వరలోనే తీసుకురానున్నామని చెప్పారు. ఫేస్‌బుక్ పే దాదాపు అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు పేపాల్ ద్వారా చెల్లింపులను చేసుకోచ్చు. ఈవెంట్ టిక్కెట్లు, ఇతర కొనుగోళ్లతోపాటు, వ్యక్తుల మధ్య నగదు లావాదేవీలు చేసుకోవచ్చు. అలాగే అమెరికాలో వచ్చే వారం నుంచి మెసేంజర్, ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో వివిధ బిజినెస్‌ల కొనుగోళ్లు చేసుకోవచ్చని లియు తెలిపారు.
ఎలా చేయాలి?
ఫేస్‌బుక్ యాప్ లేదా వెబ్‌సైట్‌లోని "సెట్టింగ్" అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆపై "ఫేస్‌బుక్ పే" కు వెళ్లి, చెల్లింపు పద్ధతిని జోడించి లావాదేవీ పూర్తి చేయవచ్చు. అంతేకాదు వినియోగదారులు డబ్బు పంపేటప్పుడు లేదా చెల్లింపు చేసేటప్పుడు అదనపు భద్రత కోసం పిన్ నెంబర్, టచ్ లేదా ఫేస్ ఐడి గుర్తింపు లాంటి బయోమెట్రిక్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. కాగా భారతదేశంలో, ఫేస్బుక్ వాట్సాప్ పే, పీర్-టు-పీర్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇటీవల ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment