సాక్షి, న్యూఢిల్లీ: టెలివిజన్ మార్కెట్‌లో దిగ్గజాలు శాంసంగ్,ఎల్‌జీ, సోనీ, షావోమీలాంటి సంస్థలకు షాక్చిచేలా బడ్జెట్ ధరలో టీవీలు అందుబాటులోకి వచ్చాయి. డీటెల్ సంస్థ ఇపుడిక టీవీల రంగంలోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే అతి చవకైన ఎల్‌సీడీ టీవీని లాంచ్ చేసింది. డీ 1 పేరుతో తీసుకొచ్చిన 19 అంగుళాల టీవీని కేవలం రూ.3,999 లకే అందిస్తోంది.
డీ1 ఎల్‌సీడీ టీవీని ధర మొదట్లో రూ.4,999 గా ఉన్నప్పటికీ, తాజాగా రూ.3,999కే అందిస్తున్నామని డీటెల్ ప్రకటించింది. 19 అంగుళాల ఏ ప‍్లస్‌గ్రేడ్ టీవీని కంప్యూటర్ మానిటర్ గా కూడా ఉపయోగించుకోవచ్చని, 1366x768 రిజల్యూషన్, యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు , 12 వాట్స్ రెండు స్పీకర్లు ఉన్నాయని తెలిపింది.
అలాగే ఈ టీవీని కొనుగోలు చేయాలనుకునేవారు డీటెల్ అధికారిక వెబ్ సైట్ గాని, మొబైల్ యాప్ గాని సంప్రదించాలి. అలాగే, డిస్ట్రిబ్యూటర్లు, పార్ట్‌నర్లు B2BAdda.com అనే వెబ్‌సైట్ లో కొనుగోలు చేయవచ‍్చని కంపెనీ వెల్లడిచింది.
నూతన ఆవిష్కరణలు కస్టమర్లను ఉత్సాహపరుస్తాయనే విశ్వాసాన్ని డీటెల్ ఎండీ యోగేష్ భాటియా వ్యక్తం చేశారు. టీవీల రేట్లు విపరీతంగా పెరుగుతున్ననేపథ్యంలో ప్రతి ఇంటికి టీవీ అనే తమ మిషన్‌లో భాగంగా సరసమైన ధరలో టీవీలను వినియోగదారులకు అందించాలని భావిస్తున్నామన్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో తమ టీవీ లక్షలాది మందిని ఆకట్టుకుంటుందన్నారు. కాగా గతంలో 299 రూపాయిలకే డీటెల్ ఒక ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment