మార్కెట్లోకి ఎంజీ మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ కారు | MG Motor India Launches ZS Electric Starting At Rs 20.88 Lakh | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి ఎంజీ మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ కారు

Jan 24 2020 3:52 AM | Updated on Jan 24 2020 3:52 AM

MG Motor India Launches ZS Electric Starting At Rs 20.88 Lakh - Sakshi

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ సంస్థ ఎంజీ మోటార్‌ ఇండియా తాజాగా జెడ్‌ఎస్‌ ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ)ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 20.88 లక్షల నుంచి రూ. 23.58 లక్షల దాకా ఉంటుంది. అయితే, జనవరి 17 అర్ధరాత్రిలోగా బుక్‌ చేసుకున్న వారికి ఈ కారును రూ. 19.88 లక్షలు–రూ. 22.58 లక్షలకే (ఢిల్లీ ఎక్స్‌షోరూం) అందిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ చాబా తెలిపారు.

అంతర్గతంగా 1,000 కార్ల బుకింగ్‌ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా 2,800 కార్లకు బుకింగ్స్‌ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఉత్పత్తిని కూడా పెంచుతున్నామని రాజీవ్‌ వివరించారు. ముందుగా నెలకు 200 యూనిట్ల తయారీ ప్రణాళిక వేసుకున్నప్పటికీ.. వచ్చే మూడు నాలుగు నెలల్లో 300–400 యూనిట్లకు పెంచుకోవాల్సి రానున్నట్లు ఆయన చెప్పారు. జనవరి 27 నుంచి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లో డెలివరీలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement