దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన మోస్ట్ ప్రీమియం కారు వచ్చేసింది. అదిరిపోయే ఫీచర్స్‌తో మల్టీ-పర్పస్ వెహికల్ ఇన్‌విక్టోను లాంచ్ చేసింది. ధరలు రూ. 24.79 లక్షల నుండి ప్రారంభం. మారుతి ఇన్‌విక్టో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను హైబ్రిడ్ మోటార్‌తో జత చేసింది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లను పొందిన తొలి మారుతీ కారు ఇన్‌విక్టో అని మారుతి సుజుకి ఇండియా తెలిపింది.
భారతదేశంలో అత్యంత ఖరీదైన కారుగా భావిస్తున్న ఇన్‌విక్టో ప్రాథమికంగా గత సంవత్సరం విడుదల చేసిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివికి రీబ్యాడ్జ్ చేసిన వెర్షన్. 2016లో ప్రారంభమై 2019లో లాంఛన ప్రాయమైన మారుతి , టయోటా కిర్లోస్కర్ భాగస్వామ్యం తర్వాత ఇది సెకండ్ ప్రొడక్షన్.
Zeta+ (7 సీటర్), Zeta+ (8 సీటర్) , Aplha+ (7 సీటర్)అనే మూడు వేరియంట్లలో వీటి ధర రూ. 24.79 లక్షల మొదలై టాప్ వేరియంట్ రూ. 28.42 లక్షల వరకు ఉంటుంది. మిడ్ వేరియంట్ ధర రూ. 24.84 లక్షలు. ఇది నెక్సా బ్లూ , మిస్టిక్ వైట్‌తో సహా నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇది నెక్సా లైనప్‌లో ఎనిమిదోది .
2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ మోటార్ 172బిహెచ్‌పి పవర్, 188ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఇన్నోవా హైక్రాస్ ప్రీమియం ఫీచర్లతో లాంచ్ అయింది. హైక్రాస్‌తో పోలిస్తే, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, సెకండ్ రో ఒట్టోమన్ సీట్లు తప్ప దాదాపు మిగిలిన ఫీచర్లున్నాయి. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు కోసం మెమరీ సెట్టింగ్స్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, 7-అంగుళాల TFT MIDతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు , ఆరుఎయిర్ బాగ్స్, లెదర్ అప్‌హోల్స్టరీతో కూడా వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment