
ముంబై: ప్రముఖ కన్జూమర్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ వీ–గార్డ్ ‘ఇన్‌సైట్ –జీ’ పేరుతో ప్రీమియం బీఎల్‌డీసీ ఫ్యాన్లు ఆవిష్కరించింది. వీటిలో ఆర్‌ఎంపీ 370 హై స్పీడ్ మోటార్ ఉంది. 5 స్టార్ రేటింగ్‌తో ఐదేళ్ల వారెంటీ కలిగి ఉన్నాయి. కనీసం 35 వాట్ల కంటే తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటూ వార్షికంగా రూ.1518 ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
డస్ట్ రిప్లెంట్ కోటింగ్, రివర్స్ మోడ్ ఆపరేషన్, వినియోగానికి అనుకూలమైన రిమోట్ కంట్రోల్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బూస్ట్ మోడ్, బ్రీజ్ మోడ్, స్లీప్ మోడ్, స్టాండర్ మోడ్, కస్టమ్ మోడ్‌తో సహా పలు ఆపరేషన్ మోడ్‌లను కూడా అందిస్తుంది. భారతీయ గృహాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఫ్యాన్లు తయారు చేశామని కంపెనీ ఎండీ రామచంద్రన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment