ఉద్యోగంతో పాటు బీమా ముఖ్యమే..!
జీవితంలో ప్రతి ఒక్కరికీ బీమా చాలా ముఖ్యం. కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న మహిళలు బీమాకి దూరంగా ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి చిన్న వయసులో బీమా పాలసీ తీసుకోవడమనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వయసుతో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడు చిన్న వయసులోనే పాలసీని తీసుకోవడం ద్వారా తక్కువ ప్రీమియంతో దీర్ఘకాలం కొనసాగవచ్చు. 30 ఏళ్లలోపున్న ఉద్యోగినులకు బీమా అవసరం గురించి తెలిసినా... ఇప్పుడు మేం బాగానే ఉన్నాం కదా!! అనే ధోరణితో వారి పోర్ట్‌ఫోలియోలో బీమాకు చోటివ్వటం లేదు. వీరు అత్యధికంగా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ వంటి నష్టభయం ఎక్కువగా ఉండే ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలవైపే చూస్తున్నారు.