Breaking: Pay Extra Money If You Share Netflix Password With Your Friends, Details Inside - Sakshi
Sakshi News home page

Netflix: యూజర్లకు నెట్‌ఫ్లిక్స్‌ భారీ షాక్‌! అది ఏంటంటే?

Published Thu, Mar 17 2022 1:40 PM | Last Updated on Thu, Mar 17 2022 2:49 PM

Sharing Your Netflix Password You May Soon Have To Pay Extra Money - Sakshi

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్‌ భారీ షాకిచ్చింది. ప్రీమియం యూజర్లు అకౌంట్‌ డీటెయిల్స్‌ వారి కుటుంబ సభ్యులకు,లేదంటే స్నేహితులకు ఫార‍్వడ్‌ చేస్తే.. అదనంగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.   

ఇటీవల ఉక్రెయిన్‌పై చేస్తున్న రష్యా యుద్ధాన్ని నెట్‌ఫ్లిక్స్‌ వ్యతిరేకించింది. రష్యాలో నెట్‌ఫ్లిక్స్‌ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకటనతో నెట్‌ఫ్లిక్స్‌ ఆదాయం భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ డైరెక్టర్ చెంగి లాంగ్ తెలిపారు. 

సాధారణంగా ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్‌ యూజర్ తమ ప్రీమియం అకౌంట్‌ లను ఫ్రీగా షేర్‌ చేసే అవకాశం ఉండేది. దీంతో ఒక్క అకౌంట్‌ను యూజర్‌ తో పాటు కుటుంబసభ్యులు చూసేవారు. కానీ ఇకపై అలా ప్రీమియం అకౌంట్‌లను షేర్‌ చేస్తే 2 డాలర్ల నుంచి 3 డాలర్ల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫీచర్‌పై వర్క్‌ చేస్తున్నామని చెంగిలాంగ్‌ చెప్పారు. ఎవరైతే ప్రీమియం అకౌంట్‌ను షేర్‌ చేస్తారో..కన్ఫర్మేషన్‌ కోసం కోడ్‌ ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఎంటర్‌ చేసిన తరువాత పైన చెప్పినట్లుగా 2 నుంచి 3 డాలర్లు అదనంగా చెల్లించాలని చెంగిలాంగ్‌ స్పష్టం చేశారు.

చదవండి: భారీగా పెరిగిన నెట్‌ప్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధరలు! ఎక్కడంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement