
హైదరాబాద్: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), వీసా భాగస్వామ్యంతో తన ఖాతాదారుల కోసం కొత్తగా రెండు ప్రీమియం డెబిట్ కార్డులను విడుదల చేసింది. ‘బీవోబీ వరల్డ్ ఒపులెన్స్’అన్నది సూపర్ ప్రీమియం వీసా ఇన్‌ఫినైట్ డెబిట్ కార్డు కాగా, మరొకటి, ‘బీవోబీ వరల్డ్ సాఫైర్’. క్రెడిట్ కార్డుల మాదిరే వీటిపై రివార్డులు, ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. (Elon Musk సంచలనం: పరాగ్ అగర్వాల్‌కు మరో షాక్!)
బోవోబీ వరల్డ్ ఒపులెన్స్ వీసా ఇన్‌ఫినైట్ కార్డుపై కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ పికప్, డ్రాప్ సేవ, అపరిమితంగా ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ సందర్శనలు, క్లబ్ మారియట్ సభ్యత్వం, హెల్త్, వెల్‌నెస్, డైనింగ్ ప్రయోజనాలను అందిస్తోంది. ఆరంభంలో జాయినింగ్ ఫీజు కింద రూ.9,500, ఆ తర్వాత ఏటా రూ.9,500 కస్టమర్లు ఈ కార్డు కోసం చెల్లించుకోవాలి. ఇలాంటి ప్రయోజనాలే కలిగిన బీవోబీ వరల్డ్ సాఫైర్ జాయినింగ్ ఫీజు రూ.750. ఏటా రూ.750 ఫీజు ఉంటుంది.