లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ అక్టోబర్ 31,2023 వరకు కొనసాగనుంది.
పాలసీ ల్యాప్స్ ఎప్పుడు అవుతుంది?
ఎల్‌ఐసీ పాలసీ హోల్డర్లు సాధారణ గడువు తేదీ లోపల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అన్వేక కారణాల వల్ల గడువు తేదీలోగా చెల్లించకపోతే మరో 15 రోజుల నుంచి 30 రోజుల లోపు (గ్రేస్ పీరియడ్) కట్టే అవకాశం ఉంది. అప్పటికీ ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్దవుతుంది. అయితే, పాలసీదారులకు భరోసా కల్పించేలా ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ కోసం, ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యాక్రమాల్ని నిర్వహిస్తుంది. తాజాగా, ఎల్‌ఐసీ రీవైవల్ క్యాంపెయిన్‌ని అందుబాటులోకి తెచ్చింది.
LIC's Special Revival Campaign - An opportunity for policyholders to revive their lapsed policies.
— LIC India Forever (@LICIndiaForever) September 26, 2023
To know more, contact your nearest LIC Branch/Agent or visit https://t.co/jbk4JUmIi9#LIC #SpecialRevivalCampaign pic.twitter.com/xHfZzyrMkD
ఖాతాదారులకు ప్రత్యేక రాయితీలు
ఈ క్యాంపెయిన్‌లో పాలసీదారులు రద్దయిన పాలసీలను పునరుద్దరించుకోవచ్చు. ఉదాహరణకు పాలసీదారు లక్ష రూపాయిల ప్రీమియం చెల్లించాలంటే ఈ రీవైవల్ క్యాంపెయిన్‌లో 30 శాతం వరకు రాయితీ పొందవచ్చు. లేట్ ఫీ ఛార్జీల కింద రూ.3,000 రాయితీ పొందే అవకాశాన్ని ఎల్‌ఐసీ కల్పిస్తుంది.
అదే ప్రీమియం రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు చెల్లించాలంటే 30 శాతంతో అంటే రూ.3,500 వరకు రాయితీ పొందవచ్చు.
ప్రీమియం 3లక్షలు చెల్లించాలంటే అదనపు ఛార్జీలలో 30 శాతం కన్‌సెషన్‌తో రూ.4,000 రాయితీని పొందవచ్చని ఎల్‌ఐసీ తెలిపింది.
పాలసీ ల్యాప్స్ అయిందా? లేదా అని తెలుసుకోవాలంటే?
♦ ఎల్‌ఐసీ పోర్ట్‌ల్‌ను ఓపెన్ చేయాలి
♦ అందులో రిజిస్టర్ యూజర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
♦ సంబంధిత వివరాల్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వొచ్చు.
♦ లాగిన్ తర్వాత పాలసీ స్టేటస్ క్లిక్ చేయాలి
♦ స్టేటస్ క్లిక్ చేస్తే మీ పాలసీ ల్యాప్స్ అయ్యిందా? లేదా అనేది తెలుసుకోవచ్చు
Comments
Please login to add a commentAdd a comment