Revival Period
-
ఎల్ఐసీ పాలసీ దారులకు శుభవార్త!
లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ అక్టోబర్ 31,2023 వరకు కొనసాగనుంది. పాలసీ ల్యాప్స్ ఎప్పుడు అవుతుంది? ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు సాధారణ గడువు తేదీ లోపల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అన్వేక కారణాల వల్ల గడువు తేదీలోగా చెల్లించకపోతే మరో 15 రోజుల నుంచి 30 రోజుల లోపు (గ్రేస్ పీరియడ్) కట్టే అవకాశం ఉంది. అప్పటికీ ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్దవుతుంది. అయితే, పాలసీదారులకు భరోసా కల్పించేలా ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ కోసం, ఎల్ఐసీ ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యాక్రమాల్ని నిర్వహిస్తుంది. తాజాగా, ఎల్ఐసీ రీవైవల్ క్యాంపెయిన్ని అందుబాటులోకి తెచ్చింది. LIC's Special Revival Campaign - An opportunity for policyholders to revive their lapsed policies. To know more, contact your nearest LIC Branch/Agent or visit https://t.co/jbk4JUmIi9#LIC #SpecialRevivalCampaign pic.twitter.com/xHfZzyrMkD — LIC India Forever (@LICIndiaForever) September 26, 2023 ఖాతాదారులకు ప్రత్యేక రాయితీలు ఈ క్యాంపెయిన్‌లో పాలసీదారులు రద్దయిన పాలసీలను పునరుద్దరించుకోవచ్చు. ఉదాహరణకు పాలసీదారు లక్ష రూపాయిల ప్రీమియం చెల్లించాలంటే ఈ రీవైవల్ క్యాంపెయిన్‌లో 30 శాతం వరకు రాయితీ పొందవచ్చు. లేట్ ఫీ ఛార్జీల కింద రూ.3,000 రాయితీ పొందే అవకాశాన్ని ఎల్ఐసీ కల్పిస్తుంది. అదే ప్రీమియం రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు చెల్లించాలంటే 30 శాతంతో అంటే రూ.3,500 వరకు రాయితీ పొందవచ్చు. ప్రీమియం 3లక్షలు చెల్లించాలంటే అదనపు ఛార్జీలలో 30 శాతం కన్సెషన్తో రూ.4,000 రాయితీని పొందవచ్చని ఎల్ఐసీ తెలిపింది. పాలసీ ల్యాప్స్ అయిందా? లేదా అని తెలుసుకోవాలంటే? ♦ ఎల్ఐసీ పోర్ట్‌ల్‌ను ఓపెన్ చేయాలి ♦ అందులో రిజిస్టర్ యూజర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ సంబంధిత వివరాల్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వొచ్చు. ♦ లాగిన్ తర్వాత పాలసీ స్టేటస్ క్లిక్ చేయాలి ♦ స్టేటస్ క్లిక్ చేస్తే మీ పాలసీ ల్యాప్స్ అయ్యిందా? లేదా అనేది తెలుసుకోవచ్చు -
సెప్టెంబర్ 17 : BRS పునరుజ్జీవనం vs BJP విమోచనం
సెప్టెంబర్ 17 వచ్చిందంటే రాజకీయ పార్టీలు కొత్త వివాదాన్ని తీసుకొస్తున్నాయి. చరిత్రలో ఇలా జరిగింది.. ఇది మా వాదన అంటూ ఒక్కో రకంగా చెప్పుకుంటున్నాయి. నిజంగా ఏం జరిగిందన్నది మరుగునపడి పార్టీలు తీసుకొస్తున్న కొత్త వాదన మీద వర్తమానం నడుస్తోంది. నాడు ఏం జరిగిందన్న లోతుల్లోకి వెళ్తోన్న రాజకీయనాయకులు జరిగిన దానికి తమదైన భాష్యం చెప్పుకుంటున్నాయి. సాక్షికి ఇచ్చిన వ్యాసాల్లో రెండు విరుద్ధ భావాలను పంచుకున్నాయి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. బీఆర్ఎస్ తరపున మంత్రి శ్రీనివాసగౌడ్, బీజేపీ తరపును విద్యాసాగర్‌రావు అందించిన ప్రత్యేక వ్యాసాలు ఇవి. BRS : పునరుజ్జీవనం : ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యమంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. కృష్ణా–గోదావరీ జలాలను తెలంగాణలోని చేను చెల్కలను తడపడానికీ, చెరువులను నింపడానికీ, తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమానికీ ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. అలా చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రతిష్ఠాత్మకమైనది ‘పాలమూరు–రంగారెడ్డి.’ తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు.’ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్ష, ప్రజల స్వప్నంగా ఉన్న కృష్ణా–గోదావరీ జలాలను చేను చెల్కలకు, చెరువులను నింపడానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమాన్ని ప్రథమ ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ఉన్న దక్కన్ పీఠభూమి శిఖరంగా ఉన్న తెలంగాణను ఆకుపచ్చ సీమగా మలిచే బృహత్తర కార్యక్రమాన్ని కేసీర్ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సమాంతరంగా నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాల పెంపు ప్రాతిపదికగా ప్రజల భాగ స్వామ్యంతో చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ అపూర్వ ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ఆర్థిక సామాజిక సాంస్కృతిక వికాసం పునరుజ్జీవం పొందుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల దాష్టీకాల వలన తెలంగాణ సంక్షుభితంగా మారింది. పాలమూరు జిల్లాలో మానవ జీవన విధ్వంసం పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ మనిషికి మనుగడకు మహా యుద్ధమే జరిగింది. ‘నీరు పల్లమెరుగు’ అనే కాలం చెల్లిన నమూనాతో తెలంగాణలో అత్యధిక చెరువులు ఉన్న ఉమ్మడి పాలమూరుపై నిర్లక్ష్యం చేసి బిరా బిరా కృష్ణమ్మను రానివ్వకుండా దగా చేశారు. తమ కళ్ళముందు పారుతున్న నీటిని కూడా చెరువులో నిల్వ కాకుండా చేశారు. అదే కృష్ణా– గోదావరులతో కోస్తా ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చుకున్నారు. గతి తప్పిన రుతువులు, బోర్ బావులతో వ్యవసాయం బావురుమన్నది. నీరు లభ్యం కాని స్థితిలో తీవ్ర దుర్భిక్షం నడుమ జీవితం నిత్య మరణంగా మారిన నేపథ్యంలో బతకడానికి దేశ విదేశాలలో వలస కూలీలుగా కట్టు బానిస జీవితం వెల్లబోస్తున్న దైన్యానికి పాలమూరు ప్రజానీకం నెట్టబడింది. మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని అంతిమ విజయతీరం వైపు చేర్చడానికి కేసీఆర్ చేపట్టిన అనేక ప్రజాస్వామ్య ఉద్యమ వ్యూహాల్లో భాగంగా 2009 లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ నుండి ఎన్నికైనారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు, భోగోళిక స్థితిగతులను అవగాహన చేసుకున్నారు. జీవ వైవిధ్యానికి అనువుగా నల్ల రేగళ్లు, ఎర్ర చెల్కలు, ఇసుక భూములు ఉన్నాయక్కడ. నీరు అందితే దక్కన్ అన్నపూర్ణగా విలసిల్లే భవిష్యత్ ఉందని నిర్ధారించుకున్నారు. వలసలు వెళ్లిన ఇక్కడి ప్రజలు తిరిగి రావడమే కాదు, పక్క ప్రాంతాల నుండి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చే దశకు చేరుకోవాలని కోరుకున్నారు. ఈ ప్రాంత లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించిన సంతోషంలో కృతజ్ఞతను చాటుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలనుకున్నారు. పాలమూరును పడావు పెట్టి కృష్ణా నీటిని తరలించుకుపోయిన అప్పటి ప్రాంతీయ ద్రోహులను ఎండగట్టారు. 2014లో రాష్ట్ర సాకారం తర్వాత ఉద్యమ క్రమంలోనే రూపకల్పన చేసుకున్న ఉత్తర తెలంగాణ కోసం ‘కాళేశ్వరం’, దక్షణ తెలంగాణ కోసం ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం కార్యాచరణ ప్రారంభించారు. చైనా నిర్మించిన సుప్రసిద్ధ ‘త్రీ గార్జెస్’ ప్రాజెక్ట్ కంటే గొప్పగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ సాంకేతికతతో, ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ అద్భుతాలతో కూడిన ‘పాలమూరు –రంగారెడ్డి' సాగునీటి ప్రాజెక్ట్‌కు 2015 జూన్ 11న శంఖు స్థాపన చేశారు. శ్రీశైలం ఎగువ భాగాన కొల్లాపుర్ మండలం ‘ఎల్లూరు’ గ్రామం వద్ద వర్షాకాలంలో 120 టీఎంసీల కృష్ణా జలాలను తరలిస్తూ పాలమూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండలో 30 వేల ఎకరాల భూమికి సాగునీరు, అలాగే 1,228 గ్రామాలకి త్రాగునీరు అందించడం దీని లక్ష్యం. కృష్ణమ్మ నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా నార్లాపూర్ అంజనగిరి, ఏదుల వీరాంజనేయ, వట్టెం వెంకటాద్రి, కరివేన కురుమూర్తి జలాశయాల గుండా ప్రవహించి లిఫ్ట్ ద్వారా రంగారెడ్డిలోని ఉద్దండాపూర్, లక్ష్మీ దేవిపల్లి జలాశయాలకు చేరుతుంది. సెప్టెంబర్ 16న ‘రంగారెడ్డి–పాలమూరు’ ప్రాజెక్ట్‌ను కొల్లాపూర్ మండలంలో ‘సింగోటం’ వద్ద కేసీర్ ప్రజలకి అంకితం చేస్తున్నారు. నీటి శబ్దం, నీటి స్పర్శ మానవ భావోద్వేగాలకు ప్రతీకగా ఇక్కడ జరిగే ఉద్వేగ మహత్తర అంకిత సభకు ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల సర్పంచ్‌లతో పాటు అశేష ప్రజానీకం తరలి రానున్నారు. కృష్ణమ్మ నీటిని కలశాలలో తీసుకొని వెళ్లి ఆయా గ్రామ దేవాలయాల స్వామి పాదాలకు అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆనతి కాలంలోనే తెలంగాణలో 78 శాతం ప్రజలు ఆధారపడే వ్యవసాయాన్ని పండుగగా మార్చే గౌరవప్రద జీవన భూమికను కేసీఆర్ పోషిస్తున్నారు. పరవళ్ళు తొక్కుతూ వస్తున్న నీటిని, కళ్ళ ముందునుంచి పారిపోతున్న నీటిని దోసిళ్ళతో ఒడిసిపట్టుకుంటున్న సంస్కృతిని సాగుచేస్తున్నారు. జీవన సంక్షోభం ద్వారా వచ్చిన ఆత్మన్యూనత స్థానంలో అభివృద్ధి సుభిక్ష ఆత్మ గౌరవ పతాకాన్ని జన మనో కేతనంగా మార్చిన యుగ కర్తగా నిలిచిపోతారు కేసీఆర్. పాలమూరు బిడ్డగా, ఇక్కడి ప్రజల విధేయుడిగా, కేసీఆర్ ఉద్యమ సహచరుడిగా, ప్రభుత్వ పాలనలో తన అనుచరుడిగా ఇతిహాసాన్ని తలపించే పాలమూరు పునరుజ్జీవన చరిత్ర నిర్మాణంలో నేనూ ఒకడిగా ఉండడం పరమానందంగా ఉంది. నిరసనోళ్ల శ్రీనివాస గౌడ్ - వ్యాసకర్త రాష్ట్ర మంత్రివర్యులు ------------- BJP : విమోచనం : హైదరాబాదు సంస్థానంలో ఉన్న వారందరూ భారతదేశంలో అంతర్భాగంగా ఉండి సామాజికంగా, సాంస్కృతికంగా కలిసి వున్నారు. ఈ సంస్థానాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనీ, ఉర్దూను అధికార భాషగా రుద్దాలనీ నిజాం విషపూరితంగా ఆలోచించిన తర్వాతే పరిస్థితులు మారిపోయాయి. భారత ప్రభుత్వం ‘పోలీసు చర్య’ను మొదలుపెట్టి, ప్రజలకు ఆ నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించింది. హైదరాబాద్ సంస్థాన విమోచనకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలిస్తే ‘భారత ప్రభుత్వ దౌత్యం, సామాన్య ప్రజల త్యాగం, యుద్ధం, విలీనం’ లాంటివి చరిత్ర పుటలలో కనబడుతాయి. ఆనాడు, తెలంగాణా, మరాఠ్వాడ, కర్ణాటకలో విస్తరించి ఉన్న ప్రాంతాలలో ఇప్పటికీ వీటి భయానక ఛాయలు కనబడతాయి. హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ వారికీ, నిజాముకూ మధ్య జరిగిన ఒప్పందానికి వ్యతిరేకంగా 1800 సంవత్సరంలోనే స్వాతంత్య్ర పోరాటం పురుడు పోసుకుంది. హిందువులు, ముస్లింలు కలిసి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. హిందూ – ముస్లిం ఐక్యతకు ఇది దర్పణం. ఆంగ్లేయులు సంపదను విచ్చలవిడిగా దోచుకొని దేశాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేశారు. 1857 జూలై 17న మౌల్వి అల్లాఉద్దిన్, తుర్రేభాజ్ ఖాన్ నాయకత్వంలో వందలాది మంది హిందూ, ముస్లింలు కోఠీలో గల బ్రిటిష్ రెసిడెన్సీపై దాడిచేశారు. ఫలితంగా తుర్రేభాజ్ ఖాన్‌ను హతమార్చి శవాన్ని కోఠీలో వేలాడదీశారు. అల్లాఉద్దిన్ అండమాన్ జైళ్లో 1884లో కన్నుమూశారు. అప్పుడే పుంజుకున్న రాంజీ గోండ్ తిరుగుబాటు తరువాత, వీరులను ప్రభుత్వం నిర్మల్ పట్టణంలో మఱి -
పాలసీదారులకు ఎల్ఐసీ బంపరాఫర్!
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగంలోని దిగ్గజ సంస్థ ఎల్ఐసీ రద్దయిన పాలసీల (ల్యాప్స్డ్) పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆగస్ట్ 17న ఇది మొదలవుతుందని.. అక్టోబర్ 21 వరకు కొనసాగుతుందని తెలిపింది. యూలిప్ పాలసీలు కాకుండా, ఇతర అన్ని జీవిత బీమా పాలసీల పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని.. ఆలస్యపు రుసుంలో ఆకర్షణీయ తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. చివరిగా ప్రీమియం చెల్లించి మానేసిన నాటి నుంచి ఐదేళ్లు దాటకపోతే వాటిని పునరుద్ధరించుకోవచ్చని తెలిపింది. సూక్ష్మ బీమా పాలసీల పునరుద్ధరణపై ఆలస్యపు రుసుంను నూరు శాతం మాఫీ చేస్తున్నట్టు పేర్కొంది. ఊహించని పరిస్థితుల వల్ల పాలసీల ప్రీమియం చెల్లించలేకపోయిన వారి కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఎల్ఐసీ తెలిపింది. -
ఎకానమీ కోలుకుంటోంది కానీ..
న్యూఢిల్లీ: ఎకానమీ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మైనస్‌లో లేదా దాదాపు సున్నా స్థాయిలోనే ఉండొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఏకంగా 23.9 శాతం క్షీణత నమోదు కావడమే ఇందుకు ప్రధాన కారణం కాగలదని ఆమె తెలిపారు. సెరావీక్ నిర్వహిస్తున్న ఇండియా ఎనర్జీ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. జీవనోపాధి కన్నా ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ మార్చి 25 నుంచి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేశామని, కరోనా మహమ్మారితో పోరాటానికి సన్నద్ధమయ్యేందుకు లాక్డౌన్ వ్యవధి ఉపయోగపడిందని సీతారామన్ పేర్కొన్నారు. లాక్డౌన్ సడలింపు తర్వాత నుంచి స్థూల ఆర్థిక పరిస్థితులు క్రమంగా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించారు. పండుగ సీజన్ ఊతం.. మూడు.. నాలుగో త్రైమాసికాల్లో సానుకూల వృద్ధిపై ఆశలు రేకెత్తించేలా పండుగ సీజన్‌తో ఎకానమీకి మరింత ఊతం లభించగలదని సీతారామన్ తెలిపారు. ‘కన్జూమర్ డ్యూరబుల్స్, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, వాహనాలు మొదలైన వాటికి డిమాండ్ పెరుగుతోంది. దేశీయంగా పండుగ సీజన్ మొదలు కావడంతో డిమాండ్ పెరగడమే కాకుండా నిలదొక్కుకుంటుందని కూడా భావిస్తున్నాము‘ అని ఆమె పేర్కొన్నారు. అయితే, ఏదేమైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం జీడీపీ వృద్ధి నెగటివ్ జోన్లో లేదా సున్నా స్థాయికి పరిమితం కావొచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రం పుంజుకోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ మళ్లీ తన స్థానాన్ని దక్కించుకోగలదని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడేందుకు ఊతమిచ్చే విధంగా చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతోందని మంత్రి చెప్పారు. వ్యాపారాలకు అనువైన పరిస్థితుల కల్పన, తక్కువ స్థాయి పన్ను రేట్లు మొదలైన విధానాలతో భారత్ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోందని ఆమె చెప్పారు. ఏప్రిల్ – ఆగస్ట్ మధ్య కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 13 శాతం పెరిగాయని వివరించారు. -
రుణం వచ్చేలా వృద్ధులకు పాలసీ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేవలం పెన్షన్ పథకాలే కాకుండా పదవీ విరమణ తర్వాత బీమా రక్షణతో పాటు, ఆర్థిక అవసరాలను తీర్చేలా వృద్ధులకు ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తెస్తోంది బజాజ్ అలయంజ్. ఇప్పటి వరకు వయసుపై బడిన వారికి మార్కెట్లో సరైన బీమా పథకం లేదని, ఆ లోటును భర్తీ చేసేలా త్వరలోనే కొత్త పథకం ప్రవేశపెడుతున్నామంటున్న బజాజ్ అలయంజ్ లైఫ్ ప్రొడక్ట్ హెడ్ రితురాజ్ భట్టాచార్యతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. కొత్త నిబంధనలు వచ్చాక అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందా? ఈ మార్పులతో ప్రీమియం రేట్లు ఏమైనా పెరిగాయా? మార్పులు జరిగినప్పుడు కొంత ఒడిదుడుకులు ఉండటం సహజం. కొత్త నిబంధనలు వచ్చి నెల రోజులు మాత్రమే అయింది. కాబట్టి అప్పుడే అమ్మకాల గురించి వ్యాఖ్యానించటం కష్టం. మార్పులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం మేం కొత్త పథకాలపై ఏజెంట్లకు అవగాహన కల్పించే పనిలో ఉన్నాం. ఇదంతా పూర్తయి మామూలు పరిస్థితి రావడానికి మరికొన్నాళ్లు పడుతుంది. మా పథకాల పోర్ట్‌ఫోలియోను సమూలంగా మార్చి కొత్త తరహా పథకాలను ప్రవేశపెట్టడానికి ఈ నిబంధనల మార్పును చక్కగా వినియోగించుకుంటున్నాం. కొత్త నిబంధనలతో బీమా రక్షణ పెరిగింది. ఆ మేరకు ప్రీమియం ధరల్లో కొంత మార్పు ఉండచ్చు కాని ప్రీమియం ధరల్లో భారీ మార్పులేమీ రాలేదు. బజాజ్ అలయంజ్ ఎటువంటి ఉత్పత్తులపై దృష్టిపెడుతోంది? ప్రస్తుతం ఎన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతం 8 వ్యక్తిగత బీమా పథకాలు, మరో 8 గ్రూపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఉద్యోగంలోకి చేరి తొలిసారిగా బీమా తీసుకునే వారికోసం, అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా బీమా రక్షణతో పాటు వారి అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉండే పథకాలపై దృష్టిసారిస్తున్నాం. ముఖ్యంగా జీవించే కాలం పెరుగుతుండటంతో 60 ఏళ్ల పైబడిన వారికి ఉపయోగపడేలా, అవసరమైతే బీమా పథకంపై రుణం తీసుకునే అవకాశం ఉండే హోల్‌లైఫ్ పథకాలపై దృష్టిసారిస్తున్నాం. ఇంతకాలం బీమారంగం వీరి అవసరాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ విభాగంపై మేం ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. వచ్చే నెలలోనే ఇటువంటి పాలసీని ప్రవేశపెట్టనున్నాం. మొత్తం మీద నెలకు 3 పథకాలు చొప్పున ప్రవేశపెట్టాలన్నది లక్ష్యం. టర్మ్, యులిప్, ఎండోమెంట్ అన్ని పథకాలు ఉండే విధంగా బ్యాలెన్స్డ్ పోర్ట్‌ఫోలియోపై దృష్టిసారిస్తున్నాం. కేవలం ఆన్లైన్లో తీసుకునేలా ఏమైనా కొత్త బీమా పథకాలను ప్రవేశపెడుతున్నారా? ప్రత్యేకంగా ఎటువంటి ఆన్లైన్ పథకాలనూ ప్రవేశపెట్టడం లేదు. కాని అన్ని పథకాలనూ ఆన్లైన్లో తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా తీసుకునే పాలసీలపై ఏజెంట్లకు కమీషన్లు చెల్లించాల్సి ఉండదు కాబట్టి ఆ మేరకు ప్రీమియం భారం తగ్గుతుంది. కాని ప్రస్తుతం సరళిని చూస్తే పాలసీ వివరాలను తెలుసుకోవడానికి ఆన్లైన్ ఉపయోగించి, ఆఫ్‌లైన్‌లో పాలసీలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. పాలసీ తీసుకునే సమయంలో ఏజెంట్ సహాయం కావాలనుకోవడం దీనికి ప్రధాన కారణంగా గమనించాం. అలాగే రెన్యువల్ ప్రీమియంలు ఆన్లైన్ ద్వారా చెల్లించే వారి సంఖ్యలో 30 శాతానికిపైగా వృద్ధి నమోదవుతోంది. యులిప్ ఫండ్స్ మార్చుకోవడం, చిరునామా మార్పు వంటి సేవలన్నీ ఆన్లైన్లో అందిస్తున్నాం. బ్యాంకులు కేవలం ఒక బీమా కంపెనీ పథకాలనే కాకుండా అన్ని బీమా కంపెనీలు పథకాలూ అమ్మేలా ఐఆర్డీఏ విడుదల చేసిన మార్గదర్శకాల సంగతి? మొత్తం వ్యాపారంలో 55 శాతం వరకు బ్యాంకుల నుంచే వస్తోంది. దేశవ్యాప్తంగా 100కిపైగా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. బ్యాంకులను బ్రోకర్లుగా మారిస్తే మా వ్యాపారం మరింత వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. వ్యాపారం సన్నగిల్లడంతో కొన్ని బీమా కంపెనీలు శాఖల సం ఖ్యను తగ్గించుకుంటున్నాయి? బజాజ్ అలయంజ్ పరిస్థితేంటి? గతంలో ఒకే పట్టణంలో నాలుగైదు శాఖలను ఏర్పాటు చేసిన బీమా కంపెనీలు వ్యయ నియంత్రణలో భాగంగా వాటిని విలీనం చేస్తున్నాయి. శాఖలను పునర్ వ్యవస్థీకరించడం తప్ప పూర్తిగా మూసేయడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 773 శాఖలు ఉన్నాయి. తగినన్ని శాఖలు ఉండటంతో కొత్తగా ఎటువంటి విస్తరణ కార్యక్రమాల యోచన లేదు.