న్యూఢిల్లీ: జీవిత బీమా రంగంలోని దిగ్గజ సంస్థ ఎల్‌ఐసీ రద్దయిన పాలసీల (ల్యాప్స్‌డ్) పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆగస్ట్ 17న ఇది మొదలవుతుందని.. అక్టోబర్ 21 వరకు కొనసాగుతుందని తెలిపింది.
యూలిప్ పాలసీలు కాకుండా, ఇతర అన్ని జీవిత బీమా పాలసీల పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని.. ఆలస్యపు రుసుంలో ఆకర్షణీయ తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. చివరిగా ప్రీమియం చెల్లించి మానేసిన నాటి నుంచి ఐదేళ్లు దాటకపోతే వాటిని పునరుద్ధరించుకోవచ్చని తెలిపింది.
సూక్ష్మ బీమా పాలసీల పునరుద్ధరణపై ఆలస్యపు రుసుంను నూరు శాతం మాఫీ చేస్తున్నట్టు పేర్కొంది. ఊహించని పరిస్థితుల వల్ల పాలసీల ప్రీమియం చెల్లించలేకపోయిన వారి కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఎల్‌ఐసీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment