మహిళలు ఎందుకని తక్కువ ప్రీమియం చెల్లిస్తారు?
ఫైనాన్షియల్ బేసిక్స్..
అతని పేరు కృష్ణ. వయస్సు 32 ఏళ్లు. కొత్తగా రెండు బీమా పాలసీలు తీసుకుందామనుకున్నాడు. ఒకటి తనకు. మరొకటి తన భార్యకు. అందుకు తగినట్లే ఇద్దరూ ఒకే రకమైన జీవిత బీమా పాలసీలను ఎంచుకున్నారు. ఇద్దరం ఒకే పాలసీ తీసుకున్నాం కదా.. ప్రీమియం కూడా ఒకేలా ఉంటుందనుకున్నాడు కృష్ణ. కానీ ఇక్కడ ఇద్దరికీ ప్రీమియం వేర్వేరుగా ఉంది. కృష్ణ పాలసీ ప్రీమియం తన భార్య పాలసీ ప్రీమియంతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇక్కడ కృష్ణ కన్నా అతని భార్య వయసులో పెద్దది.
అంటే వయసు పెరిగే కొద్ది ప్రీమియం కూడా పెరుగుతుంది కదా? అయినా కూడా ఇక్కడ అలా జరుగలేదు. పరిస్థితి భిన్నంగా ఉంది. దీనికి ఒక్కటే ప్రధాన కారణం. అది జీవన ప్రమాణం. సాధారణంగా మగవారితో పోలిస్తే మహిళల జీవన ప్రమాణం ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు పురుషుల కన్నా ఎక్కువ కాలం జీవిస్తారన్న మాట. అందుకే బీమా కంపెనీలు మహిళలకు సంబంధించిన పాలసీల విషయంలో కొంత తక్కువ ప్రీమియాన్ని వసూలు చేస్తాయి.