సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ మద్యం విక్రయాల మోత మోగుతోంది. ఆర్థిక మాంద్యానికి కూడా వెరవకుండా మద్యపాన ప్రియులు ఖరీదైన మందు తెగ తాగేస్తున్నారని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 9శాతం మేర కాస్ట్‌లీ లిక్కర్ అమ్మకాలు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మద్యం అమ్మకాల్లో 25–30 శాతం వర కు ఖరీదైన బ్రాండ్ల వాటా ఉంటుందని అంచ నా వేస్తుండగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో అయితే అది ఏకంగా 50 శాతం దాటింది. మొత్తం మద్యం విక్రయాల్లో ప్రీమి యం బ్రాండ్ హైదరాబాద్‌లో సగానికి పైగా అమ్ముడవుతోందన్నమాట.
అందుబాటులో ఆ 13 బ్రాండ్లు..
ప్రీమియం బ్రాండ్ మద్యం అమ్మకాలను పరి శీలిస్తే.. రాష్ట్ర వ్యాప్తం గా 8–9 శాతం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు హైదరాబాద్ జిల్లాలో 12.11 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. అన్ని రకాల మద్యం కలిపి 23.11 లక్షల కేసులు అమ్ముడుపోగా, 50 శాతానికి పైగా ఖరీదైన మద్యం బాటిళ్లు విక్రయించడం గమనార్హం. గత ఏడాది ఇదే సమయంలో 11.08 లక్షల కేసుల ప్రీ మియం బ్రాండ్ లిక్కర్ అమ్ముడయింది. మరో విశేషమేమిటంటే ఈ జిల్లాలో చీప్ లిక్కర్, సాధారణ మద్యం విక్రయాలు గతేడాది కంటే తగ్గాయి. గత ఏడాది చీప్‌లిక్కర్ 3.5 లక్షల కేసులు విక్రయించగా, ఈ ఏడాది 3.2 లక్షల కేసులు అమ్మారు. సాధారణ మద్యం విషయానికి వస్తే గత ఏడాది రూ.7.8 లక్షల కేసులు అమ్ముడయితే, ఈ ఏడాది 7.7 లక్షల కేసులు అమ్ముడయ్యాయి.
ఇక బీర్ల విషయానికొస్తే స్వల్పంగా విక్రయాలు పెరిగాయి. గత ఏడాది ఈ ఏడు నెలల కాలంలో 32 లక్షల కేసులు బీర్లు అమ్మ గా, ఈ ఏడాది 3 శాతం అదనంగా 33 లక్షల కేసులకు పైగా అమ్ముడయ్యాయి. ప్రీమియం బ్రాండ్ల విషయానికి వస్తే 13 రకాల ఖరీదైన మద్యం అందుబాటులో ఉన్నాయి. సిగ్నేచర్, బ్లెండర్స్ ప్రైడ్, యాంటిక్విటీ, బ్లాక్‌డాగ్, 100 పైపర్స్, టీచర్స్ (ఫిఫ్టీ), టీచర్స్ (ఐలాండ్), జానీవాకర్ బ్లాక్‌లేబుల్, రెడ్ లేబుల్, బ్లూలేబుల్,చివాస్‌రీగల్, గ్లెన్‌ఫిడిచ్, రెడ్‌సెల్యూట్ బ్రాండ్లు రాష్ట్ర మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయని అంటున్నాయి. వీటితో పాటు మరికొన్ని బ్రాండ్లు కూడా అందుబాటులోకి వస్తుండగా, ప్రీమియం బ్రాండ్ల అమ్మకాల్లో పెరుగుదల నమోదు కావడం ఎౖMð్సజ్ వర్గాలకు ఊరట కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment