ఈ ఏడాది లక్ష్యం రూ.4,200 కోట్లు | Life Insurance Corporation of India Visaka division tops South Central Zone | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది లక్ష్యం రూ.4,200 కోట్లు

Published Fri, Sep 2 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

ఈ ఏడాది లక్ష్యం రూ.4,200 కోట్లు

ఈ ఏడాది లక్ష్యం రూ.4,200 కోట్లు

పాత పాలసీల పునరుద్ధరణ గడువు 15తో పూర్తి
ప్రీమియంపై ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ వెల్లడి 

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 4,200 కోట్ల మేర కొత్త ప్రీమియం వసూళ్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లైఫ్ ఇన్సూరెన్‌‌స కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) సౌత్ సెంట్రల్ జోన్ మేనేజర్ టీసీ సుశీల్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఇందులో రూ.1,300 కోట్ల మేర వసూలరుుందని, గత ఆర్థిక సంవత్సరం ఈ వ్యవధితో పోలిస్తే ఇది సుమారు 51 శాతం అధికమని ఆయన వివరించారు. 2015-16లో కొత్త ప్రీమియం వసూళ్లు దాదాపు రూ. 3,307 కోట్లు. సంస్థ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుశీల్ కుమార్ ఈ విషయాలు చెప్పారు.

కార్యకలాపాల విస్తరణకు సంబంధించి గతేడాది మూడు శాఖలు ప్రారంభించగా, ఈ ఏడాది కొత్తగా విజయవాడలో ఇ-శాటిలైట్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సౌత్ సెంట్రల్ జోన్‌లో (ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, కర్ణాటక) ప్రస్తుతం 17,924 మంది సిబ్బంది, 1.56 లక్షల పైచిలుకు ఏజెంట్లు, 314 శాఖలు, 190 శాటిలైట్ కార్యాలయాలు ఉన్నట్లు సుశీల్ తెలియజేశారు. జోన్‌లో మొత్తం 4.42 కోట్ల పాలసీదారులకు సేవలు అందిస్తున్నామని చెప్పారాయన.

2015-16లో దాదాపు రూ. 10,582 కోట్లు విలువ చేసే 24.90 లక్షల క్లెరుుములను సెటిల్ చేశామని.. డెత్ క్లెరుుమ్స్ విషయంలో 99.78 శాతం, మెచ్యూరిటీ క్లెరుుమ్స్‌లో 99.79 శాతం పరిష్కరించామని వివరించారు. పాత పాలసీల పునరుద్ధరణ కార్యక్రమం ఈ నెల 15తో ముగియనుందన్నారు. కొత్తగా మరో 3-4 పాలసీలు ప్రవేశపెట్టేందుకు ఐఆర్‌డీఏఐ ఆమోద ముద్ర కోసం ఎదురుచూస్తున్నామని, త్వరలోనే ఒక పాలసీని తేగలమని సుశీల్ తెలియజేశారు.

ఇక, వజ్రోతోత్సవ వేడుకల్లో భాగంగా జోన్‌లోని 17 గ్రామాలను దత్తత తీసుకుని, వాటిలో తాగు నీరు వంటి మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడుతున్నామని తెలిపారు. ఒక్కో గ్రామానికి రూ. 50,000 మేర వ్యయం చేయనున్నట్లు చెప్పారు. అలాగే, 314 పాఠశాలలను దత్తత తీసుకుని, ఒక్కోదానిలో రూ. 25,000 బడ్జెట్‌తో ఫ్యాన్లూ, వాటర్ కూలర్లు మొదలైనవి సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement