Old policy
-
ఈ ఏడాది లక్ష్యం రూ.4,200 కోట్లు
• పాత పాలసీల పునరుద్ధరణ గడువు 15తో పూర్తి • ప్రీమియంపై ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 4,200 కోట్ల మేర కొత్త ప్రీమియం వసూళ్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స కార్పొరేషన్ (ఎల్ఐసీ) సౌత్ సెంట్రల్ జోన్ మేనేజర్ టీసీ సుశీల్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఇందులో రూ.1,300 కోట్ల మేర వసూలరుుందని, గత ఆర్థిక సంవత్సరం ఈ వ్యవధితో పోలిస్తే ఇది సుమారు 51 శాతం అధికమని ఆయన వివరించారు. 2015-16లో కొత్త ప్రీమియం వసూళ్లు దాదాపు రూ. 3,307 కోట్లు. సంస్థ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుశీల్ కుమార్ ఈ విషయాలు చెప్పారు. కార్యకలాపాల విస్తరణకు సంబంధించి గతేడాది మూడు శాఖలు ప్రారంభించగా, ఈ ఏడాది కొత్తగా విజయవాడలో ఇ-శాటిలైట్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సౌత్ సెంట్రల్ జోన్లో (ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, కర్ణాటక) ప్రస్తుతం 17,924 మంది సిబ్బంది, 1.56 లక్షల పైచిలుకు ఏజెంట్లు, 314 శాఖలు, 190 శాటిలైట్ కార్యాలయాలు ఉన్నట్లు సుశీల్ తెలియజేశారు. జోన్లో మొత్తం 4.42 కోట్ల పాలసీదారులకు సేవలు అందిస్తున్నామని చెప్పారాయన. 2015-16లో దాదాపు రూ. 10,582 కోట్లు విలువ చేసే 24.90 లక్షల క్లెరుుములను సెటిల్ చేశామని.. డెత్ క్లెరుుమ్స్ విషయంలో 99.78 శాతం, మెచ్యూరిటీ క్లెరుుమ్స్‌లో 99.79 శాతం పరిష్కరించామని వివరించారు. పాత పాలసీల పునరుద్ధరణ కార్యక్రమం ఈ నెల 15తో ముగియనుందన్నారు. కొత్తగా మరో 3-4 పాలసీలు ప్రవేశపెట్టేందుకు ఐఆర్డీఏఐ ఆమోద ముద్ర కోసం ఎదురుచూస్తున్నామని, త్వరలోనే ఒక పాలసీని తేగలమని సుశీల్ తెలియజేశారు. ఇక, వజ్రోతోత్సవ వేడుకల్లో భాగంగా జోన్‌లోని 17 గ్రామాలను దత్తత తీసుకుని, వాటిలో తాగు నీరు వంటి మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడుతున్నామని తెలిపారు. ఒక్కో గ్రామానికి రూ. 50,000 మేర వ్యయం చేయనున్నట్లు చెప్పారు. అలాగే, 314 పాఠశాలలను దత్తత తీసుకుని, ఒక్కోదానిలో రూ. 25,000 బడ్జెట్‌తో ఫ్యాన్లూ, వాటర్ కూలర్లు మొదలైనవి సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. -
పాత విధానంలోనే పరీక్ష
విజయనగరం అర్బన్: పదో తరగతి ఫైనల్ పరీక్షలు సమీపిస్తున్నాయి. నవంబర్ నెలాఖరు వరకు పరీక్ష విధానంపై స్పష్టత రాకపోవడంతో కొత్త సిలబస్‌ను యథావిధిగా బోధించారు. అయితే చివరకు పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో తాత్కాలిక పద్ధతులతో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు మార్గాలు అన్వేషిస్తున్నారు. పదోతరగతి ఉత్తీర్ణత లక్ష్యాల సాధనకు జిల్లాలో ప్రణాళికలు కొరవడ్డాయి. మెరుగైన ఫలితాల కోసం గ్రేడింగ్ (ప్రగతి పత్రాలు) ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, బోధన, శిక్షణపై ప్రణాళికలు రూపొందించాలి. బాగా వెనుకబడిన సి, డి గ్రేడ్ విద్యార్థులకు ప్రత్యేక మెటీరియల్‌తో శిక్షణ ఇవ్వాలి. ఆ మేరకు ప్రణాళికలు రూపొందించాలి. అయితే ఆ దిశగా జిల్లాలోని పదోతరగతి విద్యార్థుల సమ్మేటివ్-2 (అర్ధసంవత్సర పరీక్షల) గ్రేడింగ్‌ను తీసుకోవడంపై ఇప్పటికీ విద్యాశాఖ శ్రద్ధచూపలేదు. పదోతరగతి ఫలితాల కోసం కేవలం అదనపు తరగతుల నిర్వహణపై మాత్రమే విద్యాశాఖ పర్యవేక్షిస్తూ చేతులు దులుపుకొంటోంది. దీంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయుల కొరత విద్యార్థుల నిష్పత్తిని అనుసరించి జిల్లాలోని ఏ ఒక్కపాఠశాలలోనూ ఉపాధ్యాయులు లేరని విద్యాశాఖ అధికారులే చెబుతుండడం గమనార్హం. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో సమ్మేటివ్-2 (అర్ధసంవత్సర పరీక్షలు) నిర్వహించారు. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమైన తర్వాత మూల్యాంకన వివరాలను తెలియజేయాల్సి ఉంది. అయితే ఆ సమాధాన పత్రాలను దుమ్ముదులిపిన ఛాయలు చాలా చోట్ల ఇంతవరకు కనిపించలేదు. సమ్మెటివ్-1లో విద్యార్థులు వెనుకబడి ఉంటారని.. సమ్మెటివ్-2లో కొం చెం మెరుగవుతారని.. ప్రీ పబ్లిక్ నుంచి విద్యార్థులు పూర్తిస్థాయిలో పరీక్షల మూడ్‌లోకి వస్తారని.. ఈ ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరిగిపోతుందని ఉపాధ్యాయులు డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. విజయనగరం, బొబ్బి లి డివిజన్ పరిధిలలోని కొన్ని పాఠశాలల్లో ఆరునెలల పరీక్షల పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికీ జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 360 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 30,780 మంది విద్యార్థులు మార్చిలో జరిగే పదో తరగతి ఫైనల్ పరీక్షలకు హాజరుకానున్నారు. పూర్తికాని సిలబస్ సిలబస్‌ను డిసెంబర్ నెలాఖరుకు పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. అయితే పాఠ్యపుస్తకాల్లో ఫిబ్రవరి వరకు సిలబస్‌ను పూర్తి చేయొచ్చని ఉండడంతో కొత్త సిలబస్‌కు పాతపరీక్ష విధానానికి పొంతన కుదరలేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిలబస్ మారినప్పుడు టీచర్లకు పునశ్ఛరణ తరగతులను నిర్వహించాల్సి ఉంది. విద్యాసంవత్సరంలో 8 నెలలు గడిచినా కొన్ని మండలాల్లో తూతూ మంత్రంగా ఈ తరగతులు నిర్వహించారనే ఆరోపణలున్నాయి. హైస్కూల్లో 50 శాతం లోపు ప్రగతిపత్రాల (ప్రోగ్రెస్కార్డుల)ను ఇచ్చి ఉంటారని అధికారులు కాకిలెక్కలు చెబుతున్నాయి. మూడేళ్ల క్రితం వరకు ఆర్వీఎం ఆధ్వర్యంలో ప్రోగ్రెస్ కార్డులు పాఠశాలలకు అందజేసేవారు. ప్రస్తుతం స్కూల్ గ్రాంట్లోనే ప్రగతిపత్రాలు అందజేయాల్సి ఉండడంతో నిధులులేని పరిస్థితుల్లో కార్డులు కనుమరుగవుతున్నాయనేది ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రాథమిక పాఠశాలలో అసలు ఈ ప్రోగ్రెస్ కార్డుల ఊసేలేదనే వాదన వినిపిస్తోంది.