సింహాద్రిపురం: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు శనివారం రైతులు క్యూ కట్టారు. శనివారం పైడిపాలెం, చవ్వారిపల్లె, తెలికి గ్రామాలకు చెందిన రైతులు వెలుగు కార్యాలయం వద్ద ప్రీమియం చెల్లించారు. సోమవారం రావులకొలను, సుంకేసుల, నంద్యాలంపల్లె గ్రామాల రైతులు వెలుగు కార్యాలయం వద్ద ప్రీమియం చెల్లించవచ్చని ఏపీవో వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.