velugu
-
వెలుగు సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పెద్దిరెడ్డి
-
అధికారులే నకి‘లీలలు’ చేస్తుంటే..
సాక్షి, కర్నూలు : రైతుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి నకిలీ, నాసిరకం విత్తనాలు అంటే ప్రయత్నం చేశారు. అదృష్టం కొద్దీ ఓ రైతు వాటిని గుర్తించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు నాలుక కర్చుకుని ఆ విత్తనాలు వెనక్కి తీసుకుని మరో కంపెనీతో చర్చించి విత్తనాలు తెప్పించే పనిలో పడ్డారు. జిల్లాలో 2300కు పైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి. వీటికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఈ సంఘాలతో వెలుగు ప్రాజెక్టుకు అనుసంధానం చేసి ఇటీవల పత్తి విత్తనాలు కొనుగోలు చేశారు. ఈ మేరకు జిల్లాలో పత్తి పండించే మండలాలు హొళగుంద, ఆలూరు, కోసిగి, ఆస్పరి, నందవరం, పెద్దకడుబూరు మండలాల్లోని రైతులకు డీఆర్డీఏలోని అగ్రికల్చర్ కన్సల్టెంటివ్ సలహాతో గౌతమి సీడ్స్ సంస్థ కావేరి జాదూ కంపెనీ పత్తివిత్తనాలు 11 క్వింటాళ్లను రూ.10 లక్షల దాకా వెచ్చించి కొనుగోలు చేశారు. ఇందులో భాగంగా వారం రోజుల క్రితం హొళగుంద మండలానికి 200 ప్యాకెట్ల కావేరి జాదూ పత్తి విత్తనాలు ఒక్కొక్కటి రూ.640 ప్రకారం సంఘంలోని రైతులకు విక్రయించారు. అయితే భీమప్ప అనే రైతు తన వద్ద ఉన్న కావేరి జాదూ విత్తనాలను, వెలుగు ద్వారా వచ్చిన విత్తనాలను సరిపోల్చి చూశారు. రెండింటి మధ్యా తేడా ఉండటంతో వెంటనే మండల ఏవో నరేంద్రకుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ విత్తనాలను కావేరి జాదూ వారికి వాట్సాప్ ద్వారా పంపించగా అవి నకిలీగా నిర్దారించారు. ఈ విషయాన్ని వెలుగు ఏపీఎం దృష్టికి తీసుకెళ్లగా, మిగిలిన 175 ప్యాకెట్లను వెనక్కి తెప్పించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఈ విషయమై విచారణ నిర్వహించారు. మొత్తంగా వచ్చిన విత్తనాలన్నింటినీ వెనక్కి తెప్పించి సదరు గౌతమ్ సీడ్స్‌కు వెనక్కి ఇచ్చారు. ఈ మేరకు ఆ సంస్థకు చెల్లించిన మొత్తాన్ని సైతం వెనక్కి తీసుకున్నారు. తాజాగా కోరమాండల్ కంపెనీ విత్తనాలు తెప్పించేందుకు డీఆర్డీఏ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఉద్యోగుల పాత్రపై అనుమానాలు విత్తన పంపిణీ పారదర్శకంగా నిర్వహించడంతో పాటు, రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు వెలుగు ప్రాజెక్టులో ఆయా శాఖల నుంచి ఒక్కొక్కరిని డిప్యుటేషన్‌పై నియమిస్తారు. అయితే వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ఉద్యోగి ఈ విత్తనాలను గుర్తించలేకపోయారంటే అనుమానాలకు తావిస్తోంది. తమకు విత్తనాలు మంచివే చూపించారని, రైతులకు మాత్రం నకిలీవి సరఫరా చేసి ఉంటారని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఈ విత్తనాలను రైతులకు ఉచితంగా ఏమీ ఇవ్వడం లేదు. మార్కెట్‌రేటు కంటే కాస్త తక్కువగా అందజేస్తున్నారు. అయితే ఇందులోనూ కంపెనీలు కక్కుర్తి పడుతూ రైతులను నిలువునా మోసం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాటు సదరు కంపెనీపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకుండా విత్తనాలు వెనక్కి ఇచ్చేసి చేతులు దులుపుకోవడంపై అనుమానాలకు తావిస్తోంది. అదృష్టవశాత్తూ ఓ రైతు నకిలీ విత్తనాలను సకాలంలో గుర్తించాడు. లేకపోతే ఆ విత్తనాలతో సాగు చేసి తీవ్రంగా నష్టపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం గాకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
కనీస వేతనాలు చెల్లించాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : వెలుగులో పని చేస్తున్న యానిమేటర్స్‌లకు కనీస వేతనం రూ 5వేల రూపాయలు చెల్లించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని సీఐటీయు కార్యాలయంలో జిల్లా విసృత స్దాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెలుగు విఓలకు జాతీయ గ్రామీణ జీవనోపాధి పధకం కింద గ్రామస్దాయిలో పని చేస్తున్న యానిమేటర్స్‌లకు సంవత్సరాల తరబడి వెట్టి చాకిరి చేయించుకుంటూ వారికి కనీస వేతనాలు చెల్లించక పోవడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో యానిమేటర్స్ ప్రభుత్వ గుర్తింపు, వేతనాల కోసం అనేక పోరాటాలు చేస్తే ప్రస్తుత టిడిపి ప్రభుత్వం సెర్ప్ నుండి రూ 2వేల రూపాయలు గౌరవ వేతనం చెల్లించిందన్నారు. టిడిపి ప్రభుత్వం యూనిమేటర్స్పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నప్పటికి వేతనాలు మాత్రం ఇంతవరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ప్ హెల్ప్ గ్రూపుల ట్రైనరీ పేరుతో యానిమేటర్స్ చేసే పనులతో పాటు పొదుపు సంఘాలకు శిక్షణ పేరుతో వీరిని తొలగించే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పదించి యానిమేటర్స్‌కు గుర్తింపు కార్డులు అందజేసి పనిభారాన్ని తగ్గించాలన్నారు. లేనిపక్షంలో అందోళన బాట పడతామన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు ప్రభుదాస్, శేఖర్, రత్నం, రామాంజులు, తదితరులు పాల్గొన్నారు. -
బీమా చెల్లింపునకు రైతుల క్యూ
సింహాద్రిపురం: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు శనివారం రైతులు క్యూ కట్టారు. శనివారం పైడిపాలెం, చవ్వారిపల్లె, తెలికి గ్రామాలకు చెందిన రైతులు వెలుగు కార్యాలయం వద్ద ప్రీమియం చెల్లించారు. సోమవారం రావులకొలను, సుంకేసుల, నంద్యాలంపల్లె గ్రామాల రైతులు వెలుగు కార్యాలయం వద్ద ప్రీమియం చెల్లించవచ్చని ఏపీవో వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. -
వెలుగు కార్యక్రమాల అమలు భేష్
ఎన్ఆర్ఎల్ఎం బృందం కితాబు అనంతపురం టౌన్ : జిల్లాలో వెలుగు కార్యక్రమాల అమలు భేషుగ్గా ఉందని జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) ప్రతినిధులు ప్రొఫెసర్ శైలేంద్ర, వికాస్, శృతి కితాబిచ్చారు. సోమవారం ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి సంస్థలో అమలవుతున్న పథకాలపై వారు చర్చించారు. డీఆర్డీఏ–వెలుగు పీడీ వెంకటేశ్వర్లు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పథకాలను వివరించారు. బృందం సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ బృందం మంగళ, బుధవారం యల్లనూరు, 6, 7వ తేదీల్లో రామగిరి మండలాల్లో పర్యటించనుంది. ఆయా ప్రాంతాల్లో పథకాల అమలును పరిశీలించి ప్రగతి నివేదికలు జిల్లా అధికారులకు అందివ్వనున్నారు. అదనపు పీడీ సుబ్బరాయుడు, ఏఓ శ్రీనివాసులు డీపీఎంలు రామ్మోహన్, నరసయ్య, ఈశ్వరయ్య, రాధారాణి, సత్యనారాయణ, పాల్గొన్నారు. పాలక వర్గ సభ్యులతో సమావేశం జిల్లా సమాఖ్యకు చెందిన పది మంది పాలకవర్గ సభ్యులతో ఎన్ఆర్ఎల్ఎం ప్రతినిధులు ప్రత్యేకంగాసమావేశమయ్యారు. సమాఖ్య నిర్వహణ, ఆదాయ వనరులు, సబ్ కమిటీల పనితీరు, కాల్ సెంటర్, అన్న సంజీవిని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నిర్వహణపై చర్చించారు. మహిళా సమాఖ్య అధ్యక్ష, ఉపాధ్యక్షులు పి.పార్వతమ్మ, సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాల ‘వెలుగు’
► ఎక్కడికక్కడ నిధులు స్వాహా ► విచారణ పేరుతో నామమాత్రపు చర్యలు ► రికవరీ చేయకుండానే ‘బేరం’పెట్టి పోస్టింగ్ ► కొత్త స్థానంలోనూ మారని అక్రమార్కుల పంథా అనంతపురం టౌన్ : ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’.. ఈ ఫార్ములాని అక్షరాలా పాటిస్తున్నారు జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ–వెలుగు అధికారులు. మహిళా సంఘాల సొమ్మును కింది స్థాయి ఉద్యోగులు అప్పనంగా దిగమింగుతుంటే ఉన్నతాధికారులు ‘చేతివాటం’ ప్రదర్శించి వత్తాసు పలుకుతున్నారు. ఈ క్రమంలో స్వాహా చేసిన సొమ్ము పూర్తిస్థాయిలో రికవరీ కాకపోగా రాజకీయ అండతో మళ్లీ విధుల్లో చేరుతున్న అవినీతిపరులు తమ దోపిడీనే యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా కమ్యూనిటీ కో ఆర్డినేటర్ల (సీసీ)ల అవినీతికి అడ్డే లేకుండాపోతోంది. ఈ సమయంలో డీఆర్డీఏలోని ఓ అధికారి అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులకు మళ్లీ పోస్టింగ్ ఇవ్వడం కోసం ‘బేరాలు’ పెడుతున్నట్లు సమాచారం. అక్రమార్కులకే అందలం : ఏ శాఖలోనైనా ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కొత్తచెరువు మండలం లోచర్ల పంచాయతీ పరిధిలో వెలుగు సీసీ రామాంజులు 278 మంది పింఛన్‌దారుల నుంచి రూ.100 చొప్పున రూ.27,800 వసూలు చేశారు. విచారణలో వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేశారు. ఇతను బుక్కపట్నం మండలంలో పని చేసే సమయంలో బినామీ పేర్లతో గ్రామైక్య సంఘం ఏర్పాటు చేసి రూ.23 లక్షలు స్వాహా చేసిన వైనం అప్పట్లో విచారణలో కూడా తేలింది. అయినా కఠిన చర్యలు తీసుకోని అధికారులు నెల రోజులకే రొద్దం మండలానికి పోస్టింగ్ ఇచ్చారు. అక్కడి నుంచి నెల రోజుల్లోనే మళ్లీ కొత్తచెరువుకు బదిలీ చేయించుకున్న అతను పింఛన్ల సొమ్మును దిగమింగి సస్పెన్షన్‌కు గురయ్యాడు. కూడేరులో స్త్రీ నిధి రుణాల మంజూరులో చేతివాటం ప్రదర్శించినట్లు ఫిర్యాదులు రావడంతో సీసీ నారాయణస్వామిపై విచారణ చేసి సస్పెండ్ చేశారు. ఈయన బుక్కరాయసముద్రంలో పని చేస్తుండగా అవినీతికి పాల్పడ్డాడని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకే కనగానపల్లి మండలానికి పోస్టింగ్ ఇచ్చారు. అయితే అక్కడా ఇమడలేక ముడుపులు ఇచ్చుకుని కూడేరుకు వేయించుకున్నాడు. తాజాగా ఇక్కడ కూడా నిధులు స్వాహా చేయడంతో సస్పెండ్ చేయగా మళ్లీ పోస్టింగ్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. డీఆర్డీఏ కార్యాలయంలోని ఓ అధికారి సాయంతో ఇప్పటికే పోస్టింగ్ ఆర్డర్ కూడా సిద్ధం చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే మండలం జయపురం గ్రామంలో స్త్రీ నిధి డబ్బులు కాజేశారని ఓ సీసీపై పీడీకి ఫిర్యాదు అందింది. మూడేళ్ల క్రితం రూ.30 వేలు తీసుకుని అడిగితే ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై డీపీఎంలు నరసయ్య, రవీంద్రబాబు విచారణ చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గతంలో ఇదే మండలంలో సీసీగా పని చేస్తున్న వ్యక్తి ఇప్పుడు బ్రహ్మసముద్రం మండలంలో పని చేస్తున్నాడు. అప్పట్లో మహిళా సంఘానికి వచ్చిన రుణాలను సంఘం ఖాతాలోకి వేయకుండా సభ్యుల ఖాతాలోకి వేయడంలో సదరు సీసీ కీలకపాత్ర వహించాడు. ఈ క్రమంలో నిధులు స్వాహా చేశాడు. ఈ విషయం వెలుగులోకి వచ్చినా రికవరీ మాత్రం చేయలేదు. ఇటీవల జరిగిన మండల సమాఖ్య సమావేశంలో సభ్యులు ‘రికవరీ’ విషయాన్ని ప్రస్తావించినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఇక తాడిమర్రి మండలంలోని ఓ సీసీ బ్యాంక్ లింకేజ్‌కు సంబంధించి నిధులు స్వాహా చేశాడు. అయినా కఠిన చర్యల్లేవ్. పెనుకొండ మండలం గుట్లూరుకు చెందిన సీసీ అనిత రూ.40 లక్షల వరకు స్వాహా చేశారని తేలడంతో సస్పెండ్‌కు గురయ్యారు. అయితే రికవరీ మాత్రం నామమాత్రంగానే ఉంది. వీరు మాత్రమే కాదు.. ఉరవకొండ, కళ్యాణదుర్గం, శెట్టూరు, ధర్మవరం, వజ్రకరూరు, బుక్కరాయసముద్రం, గుత్తి, బుక్కపట్నం మండలాల్లో స్త్రీనిధికి సంబంధించి మోసాలు అనేకం ‘వెలుగు’లోకి వచ్చినా విచారణ పేరుతో పక్కదారి పట్టించారే గానీ కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం సస్సెన్షన్‌లో ఉన్న సిబ్బంది ఎలాగైనా పోస్టింగ్‌లు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తుండగా మరికొందరు ‘ముడుపులు’ అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో డీఆర్డీఏ, ఏపీఎంఐపీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదు. కొందరు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేశాం. కొందరిని వారి పనితీరు ఆధారంగా దూరప్రాంతాలకు బదిలీ చేశాం. డబ్బులు స్వాహా చేస్తున్న వారి విషయంలో రాజీ పడేది లేదు. – వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ–వెలుగు పీడీ -
వెలుగులో చీకటి
మార్పులు, చేర్పుల్లో అధికారుల చేతివాటం అన్నీ తానై వ్యవహరిస్తున్న ఓ ఉద్యోగి ఇటీవల 82 మంది సర్దుబాటు తాజాగా ‘అదనం’ పేరుతో వసూళ్లు జిల్లా గ్రామీణాభివృద్ధి–వెలుగు కార్యాలయంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రభుత్వంలో తమ ఉద్యోగానికి భద్రత లేకుండాపోతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెర్ఫ్ సీ ఈఓగా కృష్ణమోహన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రో జుకో నిబంధనలు వస్తుండడంతో ఉద్యోగులు మానసిక ఒ త్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టులో గతంలో విద్య, భూ రికార్డులు, ఇసుక, ఎన్‌పీఎం, పోషణ–ఆరోగ్యం, డె యిరీ, వికలాంగుల విభాగాలు ఉండేవి. కొన్నాళ్ల క్రితం వా టిని రద్దు చేశారు. ఆయా విభాగాల్లో పని చేస్తున్న సుమా రు 80 మందిని ఇటీవల సర్దుబాటు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం దుమారం రేపింది. పీడీ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి ‘సర్దుబాటు’లో కీలకంగా వ్యవహరించి వ సూళ్లకు దిగినట్లు విమర్శలు వచ్చాయి. సాధారణ బదిలీల్లో కూడా గందరగోళమే. సాక్షాత్తూ కలెక్టర్ సమక్షంలో నిర్వహించిన బదిలీలను కాదని ఆ శాఖ పీడీ వెంకటేశ్వర్లు మళ్లీ బదిలీలు చేపట్టడం విమర్శలకు తావిచ్చింది. ముడుపులు వచ్చిన వారికి, రాజకీయ బలం ఉన్న వారికే న్యాయం జ రిగిందని అప్పట్లో ఆ శాఖ ఉద్యోగులే బహిరంగంగా విమర్శించారు. నెల క్రితం నియోజకవర్గాల వారీగా కో ఆర్డినేట ర్లను నియమించాలని అధికారులు ఫైల్ కూడా సిద్ధం చేశారు. పత్రికల్లో కథనాలు రావడంతో పక్కకు పెట్టారు. ఉద్యోగులకు శాపం తాజాగా సెర్ఫ్ ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యను తేల్చేపనిలో పడ్డారు. ఈ క్రమంలో జిల్లా అధికారుల అనాలోచిత నిర్ణయాలు ఉ ద్యోగులకు శాపంగా మారుతున్నాయి. ఎక్కడైనా అదనం గా ఉద్యోగులు ఉంటే సంఖ్య చెబుతారు. కానీ ఇక్కడ మా త్రం ఏకంగా పేర్లనే వెబ్సైట్లో ఉంచుతున్నారు. గంటకోసారి మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహా రంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నట్లు తెలుస్తోం ది. పీడీ కార్యాలయంలో అన్నీ తానై వ్యవహరించే ఓ ఉద్యో గి కీలకంగా మారి ఇష్టారాజ్యంగా ఉద్యోగుల ‘అదనపు’ వి వరాలను పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 13 మంది జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ల అవసరం ఉంది. నిన్నటి వ రకు అంతే మంది ఉండేవారు. శనివారం వెబ్సైట్లో అదనంగా మరో 13 మంది పేర్లు దర్శనమిచ్చాయి. సీసీల విషయంలోనే ఇదే జరిగింది. మండలానికి ముగ్గురు లేదా న లుగురు సీసీలను నియమించుకునే వెసులుబాటు ఉంది. ఈ లెక్కన జిల్లాలోని 63 మండలాలకు గాను 189 నుంచి 252 మంది అవసరమవుతారు. అయితే ఏకంగా 332 మం దిని ఉంచారు. శుక్రవారం 219 మందిని మాత్రమే ఉంచిన అధికారులు ఒక్కరోజులోనే 332 మందికి పెంచడం గమనార్హం. సీసీల వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు అందినట్లు తెలుస్తోంది. మొత్తంగా శుక్రవారం 220 మంది అధికంగా ఉన్నారని పేర్కొన్న అధికారులు శనివారం నాటికి 79 మందిని మాత్రమే చూపడం విశేషం. velugu, Handedness, Corruption, అనంతపురం,అవినీతి, వెలుగుశాఖ, ముడుపులు