వెలుగులో చీకటి
- మార్పులు, చేర్పుల్లో అధికారుల చేతివాటం
- అన్నీ తానై వ్యవహరిస్తున్న ఓ ఉద్యోగి
- ఇటీవల 82 మంది సర్దుబాటు
- తాజాగా ‘అదనం’ పేరుతో వసూళ్లు
జిల్లా గ్రామీణాభివృద్ధి–వెలుగు కార్యాలయంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రభుత్వంలో తమ ఉద్యోగానికి భద్రత లేకుండాపోతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెర్ఫ్ సీ ఈఓగా కృష్ణమోహన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రో జుకో నిబంధనలు వస్తుండడంతో ఉద్యోగులు మానసిక ఒ త్తిడిని ఎదుర్కొంటున్నారు.
ఈ ప్రాజెక్టులో గతంలో విద్య, భూ రికార్డులు, ఇసుక, ఎన్‌పీఎం, పోషణ–ఆరోగ్యం, డె యిరీ, వికలాంగుల విభాగాలు ఉండేవి. కొన్నాళ్ల క్రితం వా టిని రద్దు చేశారు. ఆయా విభాగాల్లో పని చేస్తున్న సుమా రు 80 మందిని ఇటీవల సర్దుబాటు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం దుమారం రేపింది. పీడీ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి ‘సర్దుబాటు’లో కీలకంగా వ్యవహరించి వ సూళ్లకు దిగినట్లు విమర్శలు వచ్చాయి. సాధారణ బదిలీల్లో కూడా గందరగోళమే. సాక్షాత్తూ కలెక్టర్ సమక్షంలో నిర్వహించిన బదిలీలను కాదని ఆ శాఖ పీడీ వెంకటేశ్వర్లు మళ్లీ బదిలీలు చేపట్టడం విమర్శలకు తావిచ్చింది. ముడుపులు వచ్చిన వారికి, రాజకీయ బలం ఉన్న వారికే న్యాయం జ రిగిందని అప్పట్లో ఆ శాఖ ఉద్యోగులే బహిరంగంగా విమర్శించారు. నెల క్రితం నియోజకవర్గాల వారీగా కో ఆర్డినేట ర్లను నియమించాలని అధికారులు ఫైల్ కూడా సిద్ధం చేశారు. పత్రికల్లో కథనాలు రావడంతో పక్కకు పెట్టారు.
ఉద్యోగులకు శాపం
తాజాగా సెర్ఫ్ ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యను తేల్చేపనిలో పడ్డారు. ఈ క్రమంలో జిల్లా అధికారుల అనాలోచిత నిర్ణయాలు ఉ ద్యోగులకు శాపంగా మారుతున్నాయి. ఎక్కడైనా అదనం గా ఉద్యోగులు ఉంటే సంఖ్య చెబుతారు. కానీ ఇక్కడ మా త్రం ఏకంగా పేర్లనే వెబ్‌సైట్‌లో ఉంచుతున్నారు. గంటకోసారి మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహా రంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నట్లు తెలుస్తోం ది.
పీడీ కార్యాలయంలో అన్నీ తానై వ్యవహరించే ఓ ఉద్యో గి కీలకంగా మారి ఇష్టారాజ్యంగా ఉద్యోగుల ‘అదనపు’ వి వరాలను పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 13 మంది జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ల అవసరం ఉంది. నిన్నటి వ రకు అంతే మంది ఉండేవారు. శనివారం వెబ్‌సైట్‌లో అదనంగా మరో 13 మంది పేర్లు దర్శనమిచ్చాయి. సీసీల విషయంలోనే ఇదే జరిగింది. మండలానికి ముగ్గురు లేదా న లుగురు సీసీలను నియమించుకునే వెసులుబాటు ఉంది. ఈ లెక్కన జిల్లాలోని 63 మండలాలకు గాను 189 నుంచి 252 మంది అవసరమవుతారు. అయితే ఏకంగా 332 మం దిని ఉంచారు. శుక్రవారం 219 మందిని మాత్రమే ఉంచిన అధికారులు ఒక్కరోజులోనే 332 మందికి పెంచడం గమనార్హం. సీసీల వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు అందినట్లు తెలుస్తోంది. మొత్తంగా శుక్రవారం 220 మంది అధికంగా ఉన్నారని పేర్కొన్న అధికారులు శనివారం నాటికి 79 మందిని మాత్రమే చూపడం విశేషం.
velugu, Handedness, Corruption, అనంతపురం,అవినీతి, వెలుగుశాఖ, ముడుపులు