* వైద్యశాఖ ఉద్యోగుల బదిలీల్లో సిబ్బంది చేతివాటం
* ఖాళీలు చూపకుండా వసూళ్లు
నెల్లూరు(అర్బన్): ఆన్‌లైన్‌లో బదిలీలు చేస్తే అవినీతి అక్రమాలు అరికట్టవచ్చని వైద్యశాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య భావించారు. ఏ శాఖలో లేని విధంగా వైద్యశాఖలో ఆన్‌లైన్ బదిలీలకు శ్రీకారం చుట్టారు. అయితే ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ నెల్లూరు జిల్లా వైద్యశాఖ గుమస్తాలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ ఇక్కడ కూడా మోసాలు ఎలా చేయవచ్చో నిరూపిస్తున్నారు. బదిలీల పేరుతో రూ.లక్షలు దండుకుంటున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
లోపాలు వెలుగు చూసిందిలా
వెంకటగిరికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ ఇనమడుగు పీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న పోస్టుకు ఆప్షన్ పెట్టుకోవాలని ఆన్‌లైన్‌లో పరిశీలించగా అక్కడ ఖాళీలేనట్లు చూపించింది. దీంతో ఖంగుతిన్న ఆ టెక్నీషియన్ ఖాళీ గురించి ఆరా తీయగా సంబంధిత క్లర్కు. ఆన్‌లైన్‌లో పొందుపరచలేదని తెలిసింది. ఈ వ్యవహారంలో తాను అనుకున్న వారికి పోస్టు ఇప్పించేందుకు రూ.లక్ష వరకు చేతులు మారాయని ఆరోపణలు వస్తున్నాయి.
అలాగే ఇస్కపాళెం పీహెచ్‌సీ పరిధిలోని నిడిగుంటపాళెం సబ్‌సెంటర్ ఖాళీను కూడా ఆన్‌లైన్‌లో చూపలేదని తెలుస్తోంది. దీంతో అర్హులకు తీరని అన్యాయం జరుగనుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్ని ఖాళీలు చూపలేదో వైద్యశాఖపై కలెక్టర్ పూర్తి స్థాయి విచారణ జరిపితే గాని వాస్తవాలు వెలుగు చూడవని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రీవెన్స్ పెట్టుకుంటే న్యాయం చేస్తాం
ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వరసుందరని సాక్షి ఫోన్‌ద్వారా వివరణ కోరింది. దీంతో ఆయన మాట్లాడుతూ నష్టం జరిగిందని భావిస్తే గ్రీవెన్స్‌కు పెట్టుకోవాలి. అప్పుడు న్యాయం చేస్తాం. నీకు చెబితే ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ఎవరికీ నష్టం చేయబోమన్నారు. వివరాలు కావాలంటే బుధవారం కార్యాలయానికి వస్తే తెలుపుతామని ‘సాక్షి’కి చెప్పారు.
ఏం చేస్తున్నారంటే
తాజాగా ఇనమడుగు పీహెచ్‌సీలో ఉన్న ల్యాబ్‌టెక్నీషియన్ ఖాళీను చూపకపోవడంతో నష్టం జరిగిందని భావించిన ఓ మహిళా ఉద్యోగి డీఎంహెచ్‌ఓ వరసుందరంకి మొరపెట్టుకోవడంతో ఆన్‌లైన్ లోపాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
* ఏఎన్‌ఎంలు, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, హెల్త్‌అసిస్టెంట్లకు సంబంధించిన బదిలీలు జిల్లా వైద్యశాఖాధికారి ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో జరుగుతాయి. ఈ పోస్టుల ఖాళీల వివరాలను ఆన్‌లైన్‌లో గుమస్తా(క్లర్కు) పొందుపరచాలి. ఉద్యోగులు తమకు ఇష్టమైన ఖాళీల్లో చేరేందుకు ఆప్షన్లు ఇస్తారు. అయితే ఆన్‌లైన్‌లో ఖాళీల వివరాలను నమోదు చే యాల్సిన సెక్షన్ గుమస్తా కొన్ని ఖాళీలు ఆన్‌లైన్‌లో చూపకుండా తొక్కిపట్టారు.
* నెల్లూరు నగరానికి సమీపంలో ఉన్న పీహెచ్‌సీలలోని ఖాళీలను మా త్రమే చూపలేదు. తొక్కిపట్టిన ఖాళీ ల్లోకి బదిలీ ద్వారా రావాలనుకునే సి బ్బంది అవసరాలను అడ్డుపెట్టుకుని రూ.లక్షలు బేరం మొదలు పెట్టారనే విమర్శలు జోరందుకున్నాయి. నగర సమీపంలోకి వస్తే చాల ఖర్చులు మిగిలి పోతాయని, సమయం ఆదా అవుతుందని ఆశపెడుతున్నారు. దీం తో ఆశపడ్డ ఉద్యోగులు లంచాలు పెద్దస్థాయిలో ముట్టచెప్పి తాము కోరుకున్న చోటకు బదిలీ చేయించాలని సంబంధిత క్లర్కును కోరుతున్నారు.
అక్రమాలకు ఆన్'లైన్'!
Published Wed, Jun 29 2016 8:22 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement