Handedness
-
చిక్కుల్లో మరో ఐఏఎస్..: ఇంజనీర్లపై బూతులు, అరెస్టు
శ్రీనగర్: కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు ఢిల్లీలో స్టేడియాన్నే ఖాళీ చేయించి, చివరికి శంకరగిరి మాన్యాలు పట్టిన ఓ ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకాన్ని మర్చిపోకముందే అలాంటిదే మరో ఉదంతం తెరపైకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కుడి భుజంగా చెప్పే ఐఏఎస్ అధికారి నితేశ్వర్ కుమార్ తమను అకారణంగా బూతులు తిట్టడమే గాక అక్రమంగా అరెస్టు చేయించారంటూ సీపీడబ్ల్యూడీ ఇంజనీర్లు ఆరోపించారు. అమర్నాథ్ ఆలయ బోర్డు సీఈఓ అయిన నితేశ్వర్ మే 25న స్థానిక నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘‘పనులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఆ సందర్భంగా ఇంజనీర్లపై ఆయన అకారణంగా ఆగ్రహించారు. సంయమనం కోల్పోయి నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా తన వెంట ఉన్న ఎస్పీని ఆదేశించి ఇద్దరు ఇంజనీర్లను అరెస్టు కూడా చేయించారు’’ అని ఇంజనీర్లు చెప్పారు. నితేశ్వర్ తీరును సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఆయనను అరెస్టు చేయాలని కోరుతూ కేంద్ర హౌజింగ్ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి లేఖ రాసింది. -
వెలుగులో చీకటి
మార్పులు, చేర్పుల్లో అధికారుల చేతివాటం అన్నీ తానై వ్యవహరిస్తున్న ఓ ఉద్యోగి ఇటీవల 82 మంది సర్దుబాటు తాజాగా ‘అదనం’ పేరుతో వసూళ్లు జిల్లా గ్రామీణాభివృద్ధి–వెలుగు కార్యాలయంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రభుత్వంలో తమ ఉద్యోగానికి భద్రత లేకుండాపోతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెర్ఫ్ సీ ఈఓగా కృష్ణమోహన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రో జుకో నిబంధనలు వస్తుండడంతో ఉద్యోగులు మానసిక ఒ త్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టులో గతంలో విద్య, భూ రికార్డులు, ఇసుక, ఎన్‌పీఎం, పోషణ–ఆరోగ్యం, డె యిరీ, వికలాంగుల విభాగాలు ఉండేవి. కొన్నాళ్ల క్రితం వా టిని రద్దు చేశారు. ఆయా విభాగాల్లో పని చేస్తున్న సుమా రు 80 మందిని ఇటీవల సర్దుబాటు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం దుమారం రేపింది. పీడీ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి ‘సర్దుబాటు’లో కీలకంగా వ్యవహరించి వ సూళ్లకు దిగినట్లు విమర్శలు వచ్చాయి. సాధారణ బదిలీల్లో కూడా గందరగోళమే. సాక్షాత్తూ కలెక్టర్ సమక్షంలో నిర్వహించిన బదిలీలను కాదని ఆ శాఖ పీడీ వెంకటేశ్వర్లు మళ్లీ బదిలీలు చేపట్టడం విమర్శలకు తావిచ్చింది. ముడుపులు వచ్చిన వారికి, రాజకీయ బలం ఉన్న వారికే న్యాయం జ రిగిందని అప్పట్లో ఆ శాఖ ఉద్యోగులే బహిరంగంగా విమర్శించారు. నెల క్రితం నియోజకవర్గాల వారీగా కో ఆర్డినేట ర్లను నియమించాలని అధికారులు ఫైల్ కూడా సిద్ధం చేశారు. పత్రికల్లో కథనాలు రావడంతో పక్కకు పెట్టారు. ఉద్యోగులకు శాపం తాజాగా సెర్ఫ్ ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యను తేల్చేపనిలో పడ్డారు. ఈ క్రమంలో జిల్లా అధికారుల అనాలోచిత నిర్ణయాలు ఉ ద్యోగులకు శాపంగా మారుతున్నాయి. ఎక్కడైనా అదనం గా ఉద్యోగులు ఉంటే సంఖ్య చెబుతారు. కానీ ఇక్కడ మా త్రం ఏకంగా పేర్లనే వెబ్సైట్లో ఉంచుతున్నారు. గంటకోసారి మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహా రంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నట్లు తెలుస్తోం ది. పీడీ కార్యాలయంలో అన్నీ తానై వ్యవహరించే ఓ ఉద్యో గి కీలకంగా మారి ఇష్టారాజ్యంగా ఉద్యోగుల ‘అదనపు’ వి వరాలను పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 13 మంది జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ల అవసరం ఉంది. నిన్నటి వ రకు అంతే మంది ఉండేవారు. శనివారం వెబ్సైట్లో అదనంగా మరో 13 మంది పేర్లు దర్శనమిచ్చాయి. సీసీల విషయంలోనే ఇదే జరిగింది. మండలానికి ముగ్గురు లేదా న లుగురు సీసీలను నియమించుకునే వెసులుబాటు ఉంది. ఈ లెక్కన జిల్లాలోని 63 మండలాలకు గాను 189 నుంచి 252 మంది అవసరమవుతారు. అయితే ఏకంగా 332 మం దిని ఉంచారు. శుక్రవారం 219 మందిని మాత్రమే ఉంచిన అధికారులు ఒక్కరోజులోనే 332 మందికి పెంచడం గమనార్హం. సీసీల వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు అందినట్లు తెలుస్తోంది. మొత్తంగా శుక్రవారం 220 మంది అధికంగా ఉన్నారని పేర్కొన్న అధికారులు శనివారం నాటికి 79 మందిని మాత్రమే చూపడం విశేషం. velugu, Handedness, Corruption, అనంతపురం,అవినీతి, వెలుగుశాఖ, ముడుపులు -
అక్రమాలకు ఆన్'లైన్'!
* వైద్యశాఖ ఉద్యోగుల బదిలీల్లో సిబ్బంది చేతివాటం * ఖాళీలు చూపకుండా వసూళ్లు నెల్లూరు(అర్బన్): ఆన్లైన్లో బదిలీలు చేస్తే అవినీతి అక్రమాలు అరికట్టవచ్చని వైద్యశాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య భావించారు. ఏ శాఖలో లేని విధంగా వైద్యశాఖలో ఆన్లైన్ బదిలీలకు శ్రీకారం చుట్టారు. అయితే ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ నెల్లూరు జిల్లా వైద్యశాఖ గుమస్తాలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ ఇక్కడ కూడా మోసాలు ఎలా చేయవచ్చో నిరూపిస్తున్నారు. బదిలీల పేరుతో రూ.లక్షలు దండుకుంటున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. లోపాలు వెలుగు చూసిందిలా వెంకటగిరికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ ఇనమడుగు పీహెచ్సీలో ఖాళీగా ఉన్న పోస్టుకు ఆప్షన్ పెట్టుకోవాలని ఆన్లైన్లో పరిశీలించగా అక్కడ ఖాళీలేనట్లు చూపించింది. దీంతో ఖంగుతిన్న ఆ టెక్నీషియన్ ఖాళీ గురించి ఆరా తీయగా సంబంధిత క్లర్కు. ఆన్లైన్లో పొందుపరచలేదని తెలిసింది. ఈ వ్యవహారంలో తాను అనుకున్న వారికి పోస్టు ఇప్పించేందుకు రూ.లక్ష వరకు చేతులు మారాయని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఇస్కపాళెం పీహెచ్సీ పరిధిలోని నిడిగుంటపాళెం సబ్‌సెంటర్ ఖాళీను కూడా ఆన్లైన్లో చూపలేదని తెలుస్తోంది. దీంతో అర్హులకు తీరని అన్యాయం జరుగనుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్ని ఖాళీలు చూపలేదో వైద్యశాఖపై కలెక్టర్ పూర్తి స్థాయి విచారణ జరిపితే గాని వాస్తవాలు వెలుగు చూడవని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రీవెన్స్ పెట్టుకుంటే న్యాయం చేస్తాం ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వరసుందరని సాక్షి ఫోన్‌ద్వారా వివరణ కోరింది. దీంతో ఆయన మాట్లాడుతూ నష్టం జరిగిందని భావిస్తే గ్రీవెన్స్‌కు పెట్టుకోవాలి. అప్పుడు న్యాయం చేస్తాం. నీకు చెబితే ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ఎవరికీ నష్టం చేయబోమన్నారు. వివరాలు కావాలంటే బుధవారం కార్యాలయానికి వస్తే తెలుపుతామని ‘సాక్షి’కి చెప్పారు. ఏం చేస్తున్నారంటే తాజాగా ఇనమడుగు పీహెచ్సీలో ఉన్న ల్యాబ్‌టెక్నీషియన్ ఖాళీను చూపకపోవడంతో నష్టం జరిగిందని భావించిన ఓ మహిళా ఉద్యోగి డీఎంహెచ్ఓ వరసుందరంకి మొరపెట్టుకోవడంతో ఆన్లైన్ లోపాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. * ఏఎన్ఎంలు, ఫార్మాసిస్టులు, ల్యాబ్టెక్నీషియన్లు, హెల్త్అసిస్టెంట్లకు సంబంధించిన బదిలీలు జిల్లా వైద్యశాఖాధికారి ఆధ్వర్యంలో ఆన్లైన్లో జరుగుతాయి. ఈ పోస్టుల ఖాళీల వివరాలను ఆన్లైన్లో గుమస్తా(క్లర్కు) పొందుపరచాలి. ఉద్యోగులు తమకు ఇష్టమైన ఖాళీల్లో చేరేందుకు ఆప్షన్లు ఇస్తారు. అయితే ఆన్లైన్లో ఖాళీల వివరాలను నమోదు చే యాల్సిన సెక్షన్ గుమస్తా కొన్ని ఖాళీలు ఆన్లైన్లో చూపకుండా తొక్కిపట్టారు. * నెల్లూరు నగరానికి సమీపంలో ఉన్న పీహెచ్సీలలోని ఖాళీలను మా త్రమే చూపలేదు. తొక్కిపట్టిన ఖాళీ ల్లోకి బదిలీ ద్వారా రావాలనుకునే సి బ్బంది అవసరాలను అడ్డుపెట్టుకుని రూ.లక్షలు బేరం మొదలు పెట్టారనే విమర్శలు జోరందుకున్నాయి. నగర సమీపంలోకి వస్తే చాల ఖర్చులు మిగిలి పోతాయని, సమయం ఆదా అవుతుందని ఆశపెడుతున్నారు. దీం తో ఆశపడ్డ ఉద్యోగులు లంచాలు పెద్దస్థాయిలో ముట్టచెప్పి తాము కోరుకున్న చోటకు బదిలీ చేయించాలని సంబంధిత క్లర్కును కోరుతున్నారు.