
సాక్షి, ముంబై: జియో సినిమా వినియోగదారులకు షాకిచ్చింది. ఊహించినట్టుగానే ఇప్పటిదాకా వినియోగదారులకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తున్న జియో సినిమా తాజాగా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది, దేశీయ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ , డిస్నీ వంటి ప్రపంచ ప్రత్యర్థులతో పోరాడేందుకు ఉచిత కంటెంట్ మోడల్ నుండి వైదొలిగింది. (మైనర్ల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: నిబంధనలు మారాయి)
దీని ప్రకారం జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ సంవత్సరానికి రూ. 999గా ఉంది. ఇది ఏకకాలంలో నాలుగు పరికరాల్లో కూడా పని చేస్తుంది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సేవల ద్వారా HBO, మ్యాక్స్ ఒరిజినల్, Warner Bros ప్రత్యేకమైన కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి ఏడాది ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉంది . త్వరలోనే నెలవారీ ప్లాన్‌లు ప్రారంభించనుందని తెలుస్తోంది. జియో సినిమా, ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని ప్లాట్‌పాం జియోసినిమా పేరుతో ఓటీటీలో కూడా దూసుకొచ్చింది.మొదట్లో టెలికాం సేవలను ఉచితంగా అందించిన జియో, ఆ తరువాత పెయిడ్ సేవలను మొదలు పెట్టింది. అచ్చంగా ఆలాగే జియో సినిమా మొదట తన సేవలను ఉచితంగానే కస్టమర్లకు అందించింది. ముఖ్యంగా FIFA వరల్డ్ కప్ , IPL 2023ని ఉచితంగా స్ట్రీమింగ్‌తో మరింత ఆదరణ పొందింది. (18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్‌మెంట్)
కాగా జియో దెబ్బకు డిస్నీ ఏకంగా 84 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్‌లో 2శాతం క్షీణతను నమోదు చేసింది. మరోవైపు ప్రత్యర్థులతో ధీటుగా కంటెంట్ అందించేందకు జియో సినిమా a వివిధ ప్రొడక్షన్ స్టూడియోలతో చర్చలు జరుపుతోందనీ, రాబోయే నెలల్లో డజన్ల కొద్దీ టీవీ షోలు, మూవీలను హిందీ , తదితర భాషలలో పరిచయం చేయాలని యోచిస్తోందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment