తక్కువ ప్రీమియంతో విద్యార్థికి బీమా భరోసా | Ensure insurance for a low premium | Sakshi
Sakshi News home page

తక్కువ ప్రీమియంతో విద్యార్థికి బీమా భరోసా

Published Wed, Feb 7 2018 11:53 AM | Last Updated on Wed, Feb 7 2018 11:53 AM

Ensure insurance for a low premium - Sakshi

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

పశ్చిమగోదావరి, నిడమర్రు : జిల్లాలో అన్ని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అతి తక్కువ ప్రీమియంతో విద్యార్థి బీమా భద్రత పాలసీ జిల్లా పరిషత్‌ ఆధీనంలో అమలవుతుంది. ప్రతీ ఏటా ఫిబ్రవరి నెలలో ఈ ప్రీమియం చెల్లింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ పాలసీ బేసిక్‌ ప్రీమియం రూ.5.900లను జిల్లా పరిషత్‌ నుంచి చెల్లిస్తారు. ఈ బీమాకు సంబంధించి కొత్త/ రెన్యూవల్‌ ప్రీమియంను నగదు రూపంలో ఈ నెల 26వ తేదీలోపు సంబంధిత బీమా కంపెనీకి చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారిణి సీవీ రేణుక పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

రూ.5 ప్రీమియం
జిల్లాలోని జెడ్పీ స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న ప్రతీ విద్యార్థి ఈ భద్రత బీమా పాలసీ పథకానికి అర్హులు. ఆయా పాఠశాలల హెచ్‌ఎంల ద్వారా ఒక విద్యార్థి ఏడాదికి రూ.5 చొప్పున మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

కవరేజ్‌ కాలపరిమితి
ఈ బీమా పాలసీ కవరేజ్‌ ఒక్కో విద్యార్థికి  ఏడాది కాలానికి వర్తించును. పాలసీ కాల పరిమితి 2018 ఫిబ్రవరి 27వ తేదీ నుంచి 2019 ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో విద్యార్థికి జరిగిన ప్రమాదాన్ని నిర్ధారణ చేసుకుని బీమా కంపెనీ సూచించిన బీమా సొమ్మును అతి తక్కువ సమయంలో చెల్లిస్తారు.
జాబితా రూపంలో.. జిల్లాలోని అన్ని పాఠశాలల హెచ్‌ఎంలు ఈ నెల 26వ తేదీలోపు ఒక విద్యార్థికి రూ.5 చొప్పున జాబితా రూపంలో తయారు చేసి అందించాలి. విద్యార్థి పేరు, తరగతి, తండ్రి పేరు, అడ్మిషన్‌ నెంబరు, పుట్టిన తేదీ, ప్రీమియం సొమ్ము తదితర వివరాలు 2 స్టేట్‌మెంట్లు తయారు చేసుకుని చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం సొమ్మును  నేరుగా డీడీ రూపంలో యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్, ఏలూరు వారికి ఈ నెల 26వ తేదీలోపు పంపించాలి.

జిల్లా విద్యార్థులకే
జిల్లాలోని జెడ్పీ స్కూల్‌ విద్యార్థులకు ఈ బీమా సౌకర్యం ప్రత్యేకం.  రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేని ఈ బీమా పథకం ఈ జిల్లాలో మాత్రమే జెడ్పీ సహకారంతో అమలవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు ఉండటం వల్ల, వారి తల్లిదండ్రులకు ఈ బీమా ఉపయోగకరంగా ఉంది.   
– సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి, ఏలూరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement