
వరుణ్ ధావన్,
ముంబై: తాను ’సింగిల్’ కాదని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఒప్పుకున్నాడు. తాను డేటింగ్ లో ఉన్నానని పరోక్షంగా వెల్లడించాడు. సోఫీ చౌదరి రూపొందించిన ‘సాజన్ మైనే నాచూంగీ’ ఆడియో ఆవిష్కరణలో కార్యక్రమంలో వరుణ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సోఫీ మాట్లాడుతూ.. వరుణ్ ఒంటరిగా ఉంటున్నాడని వ్యాఖ్యానించింది. వెంటనే స్పందించిన వరుణ్ తాను ‘సింగిల్’కాదని అన్నాడు. సింగర్స్ అంటే తనకు చాలా ఇష్టమని, కానీ తనకు మాత్రం పాడడం రాదని పేర్కొన్నాడు. ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ తో వరుణ్ డేటింగ్ చేస్తున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. వీరి మధ్య ప్రేమయాణం సాగుతోందని వరుణ్ వ్యాఖ్యలు రుజువు చేశాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
దర్శకుడు డేవిడ్ ధావన్ తనయుడైన వరుణ్ 2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో హీరోగా పరిచయమయ్యాడు. తాజాగా జాన్ అబ్రహంతో కలిసి అతడు నటించిన ‘డిష్యూం’ సినిమా ఇటీవల విడుదలయింది.