ప్రభుదేవా ఫేస్‌ ఆఫ్‌ ఇండియా | Face Of India Album Produced by Prabhu Deva Studios | Sakshi
Sakshi News home page

ప్రభుదేవా ఫేస్‌ ఆఫ్‌ ఇండియా

Published Sat, Jan 27 2018 4:11 AM | Last Updated on Sat, Jan 27 2018 4:11 AM

Face Of India Album Produced by Prabhu Deva Studios - Sakshi

ప్రభుదేవా సంగీత ఆల్బమ్‌

తమిళసినిమా: ప్రభుదేవా ఈ పేరు వింటే యువతలో ఉత్సాహం పొంగుతుంది. తామూ సాధించాలనే తపన ఉరకలు వేస్తుంది. 20 ఏళ్లుగా తనదైన నటన, డాన్స్‌తో యువతను ఉర్రూతలూగిస్తున్న ప్రభుదేవా, దర్శక, నిర్మాతగానూ తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం కథానాయకుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఈయన తాజాగా ఒక సంగీత ఆల్బమ్‌ను రూపొందించారు. దాని పేరే ఫేస్‌ ఆఫ్‌ ఇండియా. వేల్స్‌ యూనివర్సిటీ అధినేత కే.గణేశ్‌తో కలిసి ప్రభుదేవా రూపొందించిన ఈ సంగీత ఆల్బమ్‌కు ఏజే దర్శకత్వం వహించారు.

దీని గురించి యూనిట్‌ వర్గాలు తెలుపుతూ గణతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ మూజికల్‌ ఆల్బమ్‌ గ్రామీణ పాటలతో మన దేశంలోని భిన్న సంస్కృతులను, భాషల ప్రాముఖ్యతలను ఆవిష్కరించేదిగా ఉంటుందన్నారు. తరుణ్, వికాశ్, వినోద్, అంజలి జయప్రకాశ్‌  నటించిన ఈ ఆల్బమ్‌కు దీపక్‌కుమార్‌పదీ ఛాయాగ్రహణం అందించారని చెప్పారు. ఈ ఆల్బమ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. అదే విధంగా ఆల్బమ్‌ టీజర్‌ను నటుడు ఆర్‌జే.బాలాజీ శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement