శివన్న కొత్త టీజర్ ఊపేస్తోంది | Shivarajkumar’s Tagru Teaser Released | Sakshi
Sakshi News home page

శివన్న కొత్త టీజర్ ఊపేస్తోంది

Published Wed, Nov 8 2017 7:57 PM | Last Updated on Wed, Mar 20 2024 12:01 PM

కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌ కొత్త సినిమా తగరు టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్‌’  చిత్రం ద్వారా శివరాజ్‌కుమార్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. నేరమూ-శిక్ష కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి దునియా సూరీ దర్శకత్వం వహించగా.. భావన, మన్వితాలు హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలో శివరాజ్‌ కుమార్‌ పోలీస్‌ ఆఫీసర్ అవతారంలో కనిపించబోతున్నాడు. ప్రతీకార నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థమౌతోంది. కత్తి.. రక్తపు మరకలు.. పగతో రగిలిపోయే హీరో.. క్రూరమైన విలన్‌, వరుస హత్యలు... ఇలా టీజర్‌ ను కట్‌ చేశారు. ఈ మధ్య సాఫ్ట్ చిత్రాలలో నటిస్తున్న శివన్నను ఒకేసారి మాస్ రోల్‌లో చూసే సరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement