Kiran Abbavaram Nenu Miku Kavalsinavadini Movie Teaser Released Today - Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: కిరణ్‌ అబ్బవరం 'నేను మీకు కావాల్సిన వాడిని' టీజర్‌ రిలీజ్‌..

Published Sun, Jul 10 2022 3:32 PM | Last Updated on Sun, Jul 10 2022 4:03 PM

Kiran Abbavaram Nenu Miku Kavalsinavadini Teaser Released - Sakshi

Kiran Abbavaram Nenu Miku Kavalsinavadini Teaser: వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. ఈ హీరో ఇటీవలే 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో కొత్త సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీధర్‌ గాదే దర్శకత్వంలో యూత్‌ఫుల్‌, ఫ్యామిలీ కథాంశంతో రెడీ అవుతోన్న సినిమా 'నేను మీకు కావాల్సిన వాడిని'. ఈ సినిమాలో సోనూ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

'డ్రైవర్‌వి డ్రైవర్‌లా ఉండూ' అనే డైలాగ్‌తో ‍ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. 'పదిసార్లు ప్రేమలో ఓడిపోయినా సరే.. సిగ్గు లేకుండా పదకొండోసారి ప్రేమకోసం పరితపించే ప్రేమికుల మధ్య బతుకుతున్నాం' అంటూ కిరణ్‌ అబ్బవరం చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ మూవీలో ప్రముఖ డైరెక్టర్‌ ఎస్‌వీ కృష్ణారెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొరియోగ్రాఫర్‌ బాబా భాస్కర్‌ మాస్టర్‌, కిరణ్‌ అబ్బవరం మధ్య వచ్చే సీన్లు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు కిరణ్‌ అబ్బవరమే స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement