
Ravi Teja Starrer Rama Rao On Duty Teaser Released: మాస్ మహారాజ రవితేజ, శరత్ మండవ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘'రామారావు ఆన్ డ్యూటీ'’. ఎల్ఎల్పి బ్యానర్లో సుధాకర్ చేకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో విడుదల చేస్తున్నట్లు సమాచారం.
అయితే తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు మేకర్స్. డిప్యూటీ కలెక్టర్‌గా రవితేజ పవర్ఫుల్ యాక్టింగ్ ఆకట్టుకుంటోంది. రవితేజ గురించి 'వాడో సూపర్ మేన్' అంటూ టీజర్ ప్రారంభమవుతుంది. ఇందులో ఫైల్స్‌పై రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్‌తో రవితేజ సంతకం చేయడం ఆకట్టుకుంటోంది. అలాగే ఒక చేతితో సంతకాలు చేస్తూ మరో చేతితో టైపింగ్ చేయడం అలరిస్తోంది. 'ఆయుధంలా బతికే తనలాంటి ధైర్యం' అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.