రానున్న 'కాఫీ విత్‌ కరణ్' షో 7వ సీజన్‌.. టీజర్ రిలీజ్‌ | Karan Johar Announces Koffee With Karan Show 7 Season Teaser | Sakshi
Sakshi News home page

Koffee With Karan: ఏడో సీజన్‌తో 'కాఫీ విత్‌ కరణ్' షో.. ఎప్పుడు? ఎక్కడంటే?

Jun 19 2022 4:23 PM | Updated on Jun 19 2022 4:33 PM

Karan Johar Announces Koffee With Karan Show 7 Season Teaser - Sakshi

అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున‍్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు.

Karan Johar Announces Koffee With Karan Show 7 Season Teaser: అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున‍్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. అయితే ఇటీవల ఈ షోను ఇక కొనసాగించనని కరణ్‌ జోహార్‌ ప్రకటించి అభిమానులను షాక్‌గు గురిచేశాడు. కానీ తాజాగా ఆదివారం (జూన్ 19) ఈ షో 7వ సీజన్‌ను టెలీకాస్ట్‌ చేస్తున్నట్లు ఓ వీడియో విడుదల చేసి ఆశ్చర్యపరిచాడు కరణ్ జోహార్. 

ఈ వీడియోలో రణ్‌బీర్‌ కపూర్, రణ్‌వీర్‌ సింగ్, సైఫ్ అలీ ఖానా, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్‌ తదితరులు ఉన్నారు. అలాగే ఈ టీజర్‌లో 'ఇప్పుడు రాబోయే సీజన్‌ మరింత పెద్దది, మెరుగైనది, ఇంకా మరింత అందమైనది' అని కరణ్ జోహార్‌ ఉత్సాహంగా చెప్పడం మనం చూడొచ్చు. కాపీ విత్ కరణ్‌ సీజన్ 7 ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో జులై 7 నుంచి ప్రసారం కానుంది. 

చదవండి: చెత్త ఏరిన స్టార్‌ హీరోయిన్‌.. వీడియో వైరల్‌
సాయి పల్లవి వివరణపై ప్రకాశ్‌ రాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
థియేటర్‌లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement