
సాక్షి, సినిమా : కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొత్త సినిమా తగరు టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రం ద్వారా శివరాజ్‌కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. నేరమూ-శిక్ష కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి దునియా సూరీ దర్శకత్వం వహించగా.. భావన, మన్వితాలు హీరోయిన్లుగా నటించారు.
ఇక ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో శివరాజ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అవతారంలో కనిపించబోతున్నాడు. ప్రతీకార నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థమౌతోంది. కత్తి.. రక్తపు మరకలు.. పగతో రగిలిపోయే హీరో.. క్రూరమైన విలన్, వరుస హత్యలు... ఇలా టీజర్ ను కట్ చేశారు. ఈ మధ్య సాఫ్ట్ చిత్రాలలో నటిస్తున్న శివన్నను ఒకేసారి మాస్ రోల్‌లో చూసే సరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఈ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమానికి శివరాజ్ సోదరుడు పునీత్‌తోపాటు తెలుగు హీరో అల్లు శిరీష్ కూడా హాజరు కావటం విశేషం. ఈ మేరకు శిరీష్ తన ట్విట్టర్‌లో ఫోటోలను పోస్ట్ చేశాడు. తగరుతోపాటు శివరాజ్ కుమార్ మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి నార్తన్ డైరెక్షన్ లో తెరకెక్కే ముఫ్తీ కాగా, మరోకటి ప్రేమ్ దర్శకత్వంలో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ది విలన్. ఇందులో కిచ్ఛా సుదీప్(ఈగ ఫేమ్)తోపాటు బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, అమీజాక్సన్ నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment