సాక్షి, హైదరాబాద్: విజయదశమి పురస్కరించుకొని పలు సినిమాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్లను మూవీ యునిట్‌లు విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగానే అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ టీజర్‌ను ఆదివారం చిత్ర బృదం విడుదల చేసింది. బొమ్మరిల్లు ‘భాస్కర్’ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తున్నారు. ‘మీ మ్యారీడ్ లైఫ్ నుంచి ఏం ఆశిసున్నారని హీరో అఖిల్ అడగ్గా.. కేరింగ్ భర్త, అన్ని పనులు షేర్ చేసుకోవాలని, నాకు ఉమ్మడి కుటుంబం అంటే చిరాకు. లవ్..లవ్..లవ్.. ఇంకేముంటుంది మ్యారీడ్ లైఫ్’ అని పూజా చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలవుతుంది. ‘కొంచం వైల్డ్‌గా ఆలోచించు డార్లింగ్ అని అఖిల్ అనగానే.. నాకు కాబోయేవాడు నా షూతో సమానం’ అని అంటుంది హిరోయిన్.
ఇక మరో డైలాగ్..‘నీకు సూర్యోదయం ఇష్టమా, సూర్యాస్తమయం ఇష్టమా అని హీరోయిన్ పూజా అఖిల్‌ని అడగ్గా.. నాకు మాత్రం సూర్యాస్తమయం అంటేనే ఇష్టం. ఎందుకంటే దాని తర్వాతే రాత్రి వస్తుందని అంటాడు అఖిల్. సరికొత్త డైలాగ్‌లతో ఉన్న టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో బన్నీ వాసు, వాసూవర్మ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీని నిర్మిస్తున్నారు. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ ఇటీవల పూర్కొన్న విషయం తెలిసింది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ-టీజర్ నెటిజన్లను అకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
నాకు కాబోయేవాడు నా షూతో సమానం
Published Sun, Oct 25 2020 12:46 PM | Last Updated on Sun, Oct 25 2020 4:01 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment