టాలీవుడ్తో పాటు అన్నిభాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సైజ్ జీరో' సినిమా టీజర్ సోమవారం సాయంత్రం విడుదలైంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్వీటీ అనుష్క బాగా లావుగా కనిపించే ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లింకును అగ్రహీరో నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. అనుష్క ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉందని, ఇది అమోఘమని ఆయన అన్నారు.
ఇక ఈ టీజర్లో పక్క పక్క సీట్లలో ఒక కుక్కతో లావుగా కనిపించే అనుష్క, కూల్డ్రింకు తాగుతూ.. చిరుతిళ్లు తింటూ.. హీల్స్తో నడవడానికి అష్టకష్టాలు పడుతూ ఉంటే ఆ పక్కనే ఉండే ఆర్య ఆమె కష్టాలు చూసి తెగ నవ్వుతుంటాడు. అలాగే, కుర్చీలో కూర్చోబోతుంటే అది కాస్తా విరిగిపోతుంది. అంతా అయిన తర్వాత.. కాస్త సన్నబడ్డ అనుష్క.. వేయింగ్ మిషన్లో బరువు చూసుకుని ఆనందంతో గెంతులు వేస్తుంది. మొత్తమ్మీద టీజర్ చూస్తేనే సినిమా ఎంత ఆసక్తికరంగా ఉంటుందో అర్థమైపోతోంది.

#SizeZero The incredible Anushka,Amazing!!http://t.co/lOlVyBAz00
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 31, 2015