శనివారమే 'నాని' వేట!  | Saripodhaa Sanivaaram Movie Teaser Released | Sakshi

శనివారమే 'నాని' వేట! 

Feb 25 2024 1:33 AM | Updated on Feb 25 2024 7:05 AM

Saripodhaa Sanivaaram Movie Teaser Released - Sakshi

‘‘కోపాలు రకరకాలుగా ఉంటాయి.. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలా ఉంటుంది.. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే ఎవరినైనా చూశారా.. నేను చూశాను’’ అంటూ నటుడు ఎస్‌జె సూర్య చెప్పే డైలాగ్స్‌తో విడుదలైంది ‘సరిపోదా శనివారం’ టీజర్‌. నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’.

ఆగస్ట్‌ 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. శనివారం (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు. నాని చేస్తున్న సూర్య పాత్ర ఒకే ఒక్క రోజు (శనివారం) మాత్రమే కోపం చూపిస్తుందని టీజర్‌ ద్వారా స్పష్టం చేశారు. వారంలో జరిగే ఘటనలను పేపర్‌ పై రాసుకుని, తనని ఇబ్బందిపెట్టేవారిని శనివారం వేటాడతాడు సూర్య. ఇక నాని హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు దానయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement